
Gautam Gambhir: భారత మాజీ క్రికెటర్, ప్రధాన కోచ్ గంభీర్‌కు బెదిరింపులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ క్రికెటర్,మాజీ ఎంపీ ,ప్రస్తుత భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్‌ను హత్య చేస్తామని బెదిరింపు వచ్చిన ఘటన కలకలం రేపింది.
ఇస్లామిక్ స్టేట్ (ISIS)తో సంబంధాలు ఉన్న అనుమానితుడు ఈ బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో గంభీర్ వెంటనే ఢిల్లీ పోలీసులను ఆశ్రయించి తనకు వచ్చిన బెదిరింపు ఇమెయిల్‌ల గురించి వివరించారు.
ఆ ఇమెయిల్‌లో గంభీర్‌ను, అతని కుటుంబాన్ని హత్య చేస్తామన్నదే కాకుండా, ఆయన నివాసం వద్ద బాంబు దాడులు చేస్తామని స్పష్టం చేసినట్లు గంభీర్ పోలీసులకు తెలిపారు.
ఈ బెదిరింపులు ఒకేసారి కాకుండా గత కొన్ని రోజులుగా వరుసగా ఇమెయిల్ రూపంలో వస్తున్నాయని ఆయన వెల్లడించారు.
వివరాలు
గంభీర్ కుటుంబానికి కూడా అదనపు భద్రత
ఈ సమాచారం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా పరిగణించారు.
గంభీర్ నివాసం వద్ద భద్రతను ముమ్మరం చేశారు. ఆయన కుటుంబానికి కూడా అదనపు భద్రతను కల్పించారు.
ఇక ఈ బెదిరింపు ఇమెయిల్‌ల మూలాన్ని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టింది.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ ఇమెయిల్‌లు విదేశాల నుంచి, ముఖ్యంగా పాకిస్థాన్ లేదా ఇతర దేశాల నుంచి వచ్చినట్లుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
దర్యాప్తు పూర్తయ్యే వరకు గంభీర్‌కి, ఆయన కుటుంబానికి పోలీసులు హై అలర్ట్ భద్రతను కొనసాగించనున్నారు.