LOADING...
వన్డేల్లో ఆగ్రస్థానికి భారత్
వన్డేలో మొదటి స్థానానికి చేరుకున్న టీమిండియా

వన్డేల్లో ఆగ్రస్థానికి భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2023
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. స్వదేశంలో మళ్లీ మరోసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్, శ్రీలంక‌పై వరుసగా వన్డే సిరీస్‌లను గెలుచుకొని సత్తా చాటింది. ప్రస్తుతం టీ20ల్లో, వన్డేల్లో టీమిండియా ఆగ్రస్థానంలో నిలిచింది.

టీమిండియా

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సాధిస్తే, టెస్టులోనూ టీమిండియా మొదటి స్థానం..!

టీమిండియా టెస్టుల్లో అగ్రస్థానంలో నిలవాలంటే త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టు సిరీస్ ను 2-0 అంతకంటే మెరుగ్గా గెలిస్తే మూడు ఫార్మాట్లలోనూ ఏకకాలంలో భారత్ నంబర్ వన గా నిలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టెస్టులో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. త్వరలోనే సౌతాఫ్రికాతో ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ ను ఆడనుంది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగిలిగితే.. ఇంగ్లిష్ జట్టు భారత్‌ను వెనక్కి నెట్టి వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.