Page Loader
కరేబియన్ బీచ్ లో వాలీబాల్ ఆడిన టీమిండియా ప్లేయర్లు
బీచులో వాలీబాల్ ఆడుతున్న టీమిండియా ప్లేయర్లు

కరేబియన్ బీచ్ లో వాలీబాల్ ఆడిన టీమిండియా ప్లేయర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 03, 2023
06:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచ కప్ సన్మాహకాల్లో ఉన్న భారత జట్టు వెస్టిండీస్ గడ్డపై కాలు మోపింది. టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లలో సత్తా చాటేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విండీస్‌కు చేరుకున్న భారత ప్లేయర్లు బీచులో వాలీబాల్ ఆడుతూ కరీబియన్ దీవుల్లో ఎంజాయ్ చేస్తు కనిపించారు. జులై 12 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, పదిరోజుల ముందే ప్లేయర్స్ అందరూ కరీబియన్ దీవులకు వెళ్లారు. డొమినికాలోని ఓ బీచ్‌లో ప్లేయర్స్ వాలీబాల్ ఆడుతున్న వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఆకౌంట్లో షేర్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లీతో పాటు కోచ్ రాహుల్ కూడా వాలీబాల్ ఆడడం విశేషం.

Details

విండీస్ జట్టుతో తలపడే  ఇండియా టెస్టు టీమ్ ఇదే

టీమిండియా తొలి టెస్టుకు ముందు బార్బడోస్‌లో రెండు ప్రాక్టీస్ మ్యాచులను ఆడనుంది. అదే విధంగా జులై 6న స్థానిక జట్టుతో టీమిండియా తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. తర్వాత ఐర్లాండ్ లో మూడు టీ20ల సిరీస్ మ్యాచ్ ఆడనుంది. వన్డే వరల్డ్ కప్‌కు ముందు ఇండియాకు ఈ సిరీస్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఇండియా టెస్ట్ టీమ్ ఇదే రోహిత్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, రహానే, భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, నవ్‌దీప్ సైనీ