
Virat Kohli: తిరువనంతపురానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. విరాట్ కోహ్లీ ఎక్కడ?
ఈ వార్తాకథనం ఏంటి
ఈనెల 3న నెదర్లాండ్స్‌తో జరిగే వార్మప్ మ్యాచు కోసం టీమిండియా ఇప్పటికే కేరళలోని తిరువనంతపురంకు చేరుకుంది.
అయితే టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వ్యక్తిగత ఎమర్జెన్సీ కారణంగా జట్టుతో కలిసి రాలేదని తెలుస్తోంది.
అతను సడన్ గా ముంబైకి వెళ్లినట్లు స్పోర్ట్స్ మీడియా సంస్థలు ధ్రువీకరించాయి. కోహ్లీ యాజమాన్యం అనుమతితో సెలవు తీసుకొని ముంబాయి విమానం ఎక్కినట్లు సమాచారం.
వ్యక్తిగత అత్యవసర కారణాలతో అతడు జట్టును వీడినట్లు తెలిసింది. ఇక కోహ్లీ సోమవారం తిరిగి జట్టుతో చేరనున్నారు.
Details
రెండో వార్మప్ మ్యాచులో టీమిండియాతో తలపడనున్న నెదర్లాండ్స్
విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రెండోసారి తల్లికాబోతున్నట్లు ఇటీవల జోరుగా వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ ముంబైకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల వీరిద్దరూ ముంబయిలోని ఓ గైనకాలజీ ఆస్పత్రి వద్ద కనిపించనట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
2017లో కోహ్లీ, అనుష్క వివాహం జరగ్గా, 2021 జనవరిలో వీరికి వామిక జన్మించిన విషయం తెలిసిందే.
రెండో వార్మప్ మ్యాచులో టీమిండియా, నెదర్లాండ్స్ తో అక్టోబర్ 3న తలపడనుంది.
ఇక ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 8న భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.