IND vs ENG : ఇంగ్లండ్ చిత్తు.. 150 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచులో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచుల సిరీస్‌ను 4-1తో భారత్ గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇంగ్లండ్ ముందు 247 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ 10.3ఓవర్లలో 97 పరుగులు చేసి అలౌటైంది.
దీంతో భారత్ 150 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిలిప్ సాల్ట్ 23 బంతుల్లో 55 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు.
Details
ఆల్ రౌండర్ ప్రదర్శనతో రాణించిన అభిషేక్ శర్మ
లివింగ్ స్టోన్ (10), హ్యరీ బ్రూక్ (2), బట్లర్ (7), బెన్ డకట్ (0) తీవ్రంగా నిరాశపరిచారు.
భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, శివం దూబే, అభిషేక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
బ్యాటింగ్ లో శతకం బాదిన అభిషేక్ శర్మ, బౌలింగ్ లోనూ రెండు వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీమిండియా సూపర్ విక్టరీ
5TH T20I. WICKET! 10.2: Adil Rashid 6(6) ct Dhruv Jurel (Sub) b Mohammad Shami, England 97/9 https://t.co/B13UlBNLvn #INDvENG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) February 2, 2025