
Team India: టీమిండియా స్వదేశీ సిరీస్‌ల షెడ్యూల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ ఏడాది స్వదేశంలో భారత జట్టు ఆడే సిరీస్‌ల పూర్తి వివరాలను వెల్లడించింది.
అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న భారత్, నవంబర్-డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
విశాఖపట్నంలో ఒక వన్డే మ్యాచ్ (దక్షిణాఫ్రికాతో) జరగనుంది. గతంలో వైజాగ్‌లో భారత్ చివరగా 2023 మార్చిలో వన్డే మ్యాచ్ ఆడింది, ఆ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో టీమిండియా పరాజయం పాలైంది.
భారత్ 117 పరుగులకే ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 11 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా చేధించింది.
Details
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్
మొదటి టెస్టు : అక్టోబర్ 2-6 (అహ్మదాబాద్)
ద్వితీయ టెస్టు: అక్టోబర్ 10-14 (కోల్‌కతా)
సౌతాఫ్రికాతో సిరీస్ వివరాలు
టెస్టు మ్యాచ్‌లు
మొదటి టెస్టు : నవంబర్ 14-18 (దిల్లీ)
రెండో టెస్టు : నవంబర్ 22-26 (గువాహటి)
Details
వన్డే మ్యాచ్‌లు
మొదటి వన్డే : నవంబర్ 30 (రాంచీ)
రెండో వన్డే : డిసెంబర్ 3 (రాయ్‌పూర్)
మూడో వన్డే : డిసెంబర్ 6 (విశాఖపట్నం)
టీ20 మ్యాచ్‌లు
మొదటి టీ20 : డిసెంబర్ 9 (కటక్)
రెండో టీ20 : డిసెంబర్ 11 (ఛండీగడ్)
మూడో టీ20 : డిసెంబర్ 14 (ధర్మశాల)
నాలుగో టీ20 : డిసెంబర్ 17 (లఖ్‌నవూ)
ఐదో టీ20 : డిసెంబర్ 19 (అహ్మదాబాద్)