Team India : టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా.. టాప్ లో ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారత జాతీయ క్రికెట్ జట్టు తాజాగా టీ20 ప్రపంచకప్ 2026లో ఘన విజయం సాధించి మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ను మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇదే సమయంలో ఐసీసీ తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఈ మెగా టోర్నీలో భారత ఆటగాళ్లు చూపించిన అద్భుత ప్రదర్శన తాజా ర్యాంకింగ్స్‌లో స్పష్టంగా ప్రతిఫలించింది. బ్యాటింగ్ విభాగంలో టాప్-2 స్థానాలను టీమిండియా బ్యాటర్లు కైవసం చేసుకోవడం విశేషం.
Details
మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్న అభిషేక్ శర్మ
ఈ సీజన్‌లో ఫామ్‌పై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ మాత్రం మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అదే సమయంలో ఈ టోర్నీలో 317 పరుగులతో రాణించిన ఇషాన్ కిషన్ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. వీరిద్దరి మధ్య కేవలం నాలుగు రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ఇక ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన సంజు శాంసన్ 22వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు శివం దూబే 27వ స్థానాన్ని దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపించాయి. ఇప్పటివరకు నంబర్ వన్ స్థానంలో ఉన్న వరుణ్ చక్రవర్తి రెండో స్థానానికి పడిపోయాడు.
Details
అగ్రస్థానంలో సికిందర్ రాజా
ఆఫ్ఘానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మొదటి స్థానానికి ఎగబాకాడు. యార్కర్ కింగ్‌గా పేరుగాంచిన జస్పిత్ బుమ్రా ఆరో స్థానానికి చేరుకోగా, అక్షర్ పటేల్ 17వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హర్దిక్ పాండ్యా తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. సికిందర్ రాజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇతర దేశాల ఆటగాళ్ల విషయానికి వస్తే, సెమీఫైనల్లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించిన ఫిన్ అలాన్ 20వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే జాకబ్ బెతెల్ ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఈ విధంగా టీ20 వరల్డ్‌కప్ విజయోత్సాహం మధ్య తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా భారత ఆటగాళ్లు తమ సత్తా చాటారు.