Page Loader
Gautam Gambhir : పాక్ కన్నా శ్రీలంకపైన టీమిండియా గెలవడం అద్భుతం : గౌతమ్ గంభీర్
పాక్ కన్నా శ్రీలంకపైన టీమిండియా గెలవడం అద్భుతం : గౌతమ్ గంభీర్

Gautam Gambhir : పాక్ కన్నా శ్రీలంకపైన టీమిండియా గెలవడం అద్భుతం : గౌతమ్ గంభీర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2023
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2023 టోర్నీలో భారత జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తోంది. సూపర్ 4లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచులో శ్రీలంకపై టీమిండియా విజయం సాధించింది. దీంతో భారత్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. పాక్ పై ఘన విజయం సాధించిన తర్వాత శ్రీలంకపై భారత్ కష్టపడి గెలిచింది. భారత జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైనప్పటికీ, ప్రత్యర్థిని కట్టడి చేసి, గెలుపొందడం అద్భుతమని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. భారత్ పాక్ పై విజయం కంటే ఇదే అత్యంత నమ్మకమైన గెలుపుగా గంభీర్ అభివర్ణించాడు. ఈ మ్యాచులో తొలుత టీమిండియా 213 పరుగులు చేయగా, లంకను 172 పరుగులకే భారత్ అలౌటైంది.

Details

టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా ఆడారు : గంభీర్  

తన దృష్టిలో టీమిండియా అద్భుతంగా ఆడిందని, దీంతో భారత్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని, బ్యాటింగ్ విఫలమైనా, బౌలింగ్ రాణించారని గంభీర్ కొనియాడారు. బుమ్రా గాయం నుంచి కోలుకొని వచ్చి అద్భుతంగా బౌలింగ్ చేశాడమని, ఇక కుల్దీప్ యాదవ్ కీలక సమయాల్లో వికెట్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారన్నారు. శ్రీలంకపై విజయంతో కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ఆటగాళ్ల అందరిలోనూ మనోధైర్యం పెరిగిందనడంలో సందేహం లేదని గంభీర్ చెప్పుకొచ్చాడు.