Page Loader
వన్డేల్లో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ రికార్డ్ గోవిందా
వన్డేల్లో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్

వన్డేల్లో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ రికార్డ్ గోవిందా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 31, 2023
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు యువ ఓపెనర్, స్టార్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తొలి 26 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డ్ నమోదు చేశాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. ఈ నేపథ్యంలోనే 1322 పరుగులు చేసిన బాబర్ అజామ్‌ ఘనతను గిల్ అధిగమించాడు. విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమిపాలైనా, 34 పరుగులతో గిల్ సరికొత్త మైలురాయిని సాధించాడు. టీమిండియా తరఫున 26 వన్డే మ్యాచ్‌లు ఆడిన గిల్, 61 సగటుతో 1352 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో పాటు ఓ డబుల్ సెంచరీనీ (208 రన్స్) నమోదు చేయడం విశేషం.

DETAILS

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే రెండో వన్డే ఆడిన భారత్

మూడో స్థానంలో 1303 పరుగులతో జోనాథన్ ట్రాట్ (ఇంగ్లండ్), నాల్గొ స్థానంలో 1275 పరుగులు చేసిన ఫఖర్ జమాన్ (పాకిస్థాన్) కొనసాగుతున్నారు. 1. శుభ్‌మన్ గిల్ (భారత్) 2. బాబర్ (పాకిస్థాన్) 3. జోనాథన్ ట్రాట్ (ఇంగ్లండ్) 4. ఫఖర్ జమాన్ (పాకిస్థాన్)లు నిలిచారు. మరోవైపు టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే రెండో వన్డే ఆడిన భారత్ ఓటమి చవిచూసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 181 పరుగులకే చేతులెత్తేసింది. 182 పరుగుల ఛేదనలో విండీస్ జట్టు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. సిరీస్ ఫలితం తేల్చే మూడో వన్డే ఆగస్ట్ 1న జరగనుంది.