LOADING...
ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం
హాప్ సెంచరీతో రాణించిన సూర్యకుమార్ యాదవ్

ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2023
09:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన భారత్, ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (5/51) ఐదు వికెట్లతో రాణించడంతో ఆస్ట్రేలియా 276 పరుగులకు అలౌటైంది.

Details

హాఫ్ సెంచరీతో రాణించిన గైక్వాడ్, గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్

భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజా తలా ఓ వికెట్ పడగొట్టాడు. లక్ష్య చేధనకు భారత్ కు ఓపెనర్లు శుభ్ మాన్‌గిల్, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 142 పరుగులు జోడించారు. గైక్వాడ్(71), గిల్(74), కెప్టెన్ కెఎల్ రాహుల్ (58*), సూర్యకుమార్ యాదవ్(50) హాఫ్ సెంచరీతో చెలరేగి భారత్ కు విజయాన్ని అందించారు. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్(3) రనౌట్ అయి నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో అడమ్ జంపా 2, పాట్ కమిన్స్, సీన్ అబాట్ తలా ఓ వికెట్ తీశారు.