
IND vs ENG: ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు జట్టు ప్రకటన.. బుమ్రా ఇన్,రాహుల్ అవుట్
ఈ వార్తాకథనం ఏంటి
ధర్మశాలలో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదవ టెస్టు కోసం బీసీసీఐ గురువారం భారత జట్టును ప్రకటించింది.
చివరి టెస్టులో టీమిండియాలో మార్పులు చోటుచేసుకున్నాయి.గాయపడిన కే ఎల్ రాహుల్ కోలుకోకపోవడంతో ధర్మశాలలో ఆడడం లేదు. ప్రస్తుతం,కే ఎల్ రాహుల్ ను మెరుగైన చికిత్స కోసం లండన్ కు పంపించారు.
ఈ నేపథ్యంలో రాంచి టెస్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా మళ్ళీ జట్టులోకి వచ్చాడు.దీంతో బుమ్రా ధర్మశాలలో జరిగే ఇదో టెస్ట్ లో ఆడబోతున్నాడు.
రాహుల్ గైర్హాజరీలో చివరి మూడు టెస్టుల్లో రజత్ పాటిదార్ నెం.4 స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు.
రజత్ పాటిదార్ బ్యాటింగ్ చేసిన ఆరు ఇన్నింగ్స్‌లలో ఆకట్టుకోలేకపోయాడు.అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ ఆడుతున్నాడు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 3-1తో ఆధిక్యంలో ఉంది.
Details
చివరి టెస్టుకి టీమిండియా స్క్వాడ్
భారత జట్టు: రోహిత్ శర్మ (C), జస్ప్రీత్ బుమ్రా (VC), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (WK), కెఎస్ భరత్ (WK), దేవదత్ పడిక్కల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు జట్టు ప్రకటన
🚨 NEWS 🚨#TeamIndia's squad for the 5th @IDFCFIRSTBank Test against England in Dharamsala announced.
— BCCI (@BCCI) February 29, 2024
Details 🔽 #INDvENG https://t.co/SO0RXjS2dK