
Sachin Tendulkar: భారత్,ఇంగ్లాండ్ టెస్టుల్లో పటౌడీ వారసత్వాన్ని కొనసాగించాలి: సచిన్ టెండూల్కర్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తీసుకున్న నిర్ణయం కారణంగా మొదలైన పటౌడీ పేరు మార్పు వివాదానికి చివరికి ముగింపు లభించింది. భారత్,ఇంగ్లండ్ మధ్య జరగే టెస్టు సిరీస్ విజేతలకు ఇస్తున్న ట్రోఫీకి ఇంతవరకూ దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరును ఉపయోగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఈసీబీ ఈ ట్రోఫీ పేరును'టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ'గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ మార్పుపై వివిధ వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి.
వివరాలు
ట్రోఫీ పేరు మాత్రం 'టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ'
ఈ పరిణామాల నేపథ్యంలో స్వయంగా సచిన్ టెండూల్కర్‌తో పాటు, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా కూడా ఈసీబీని అభ్యర్థిస్తూ, పటౌడీ పేరును తొలగించకుండా ఉండాలని సూచించారు. వారి అభ్యర్థనకు స్పందించిన ఈసీబీ చివరకు కొంత వెనక్కి తగ్గింది. పటౌడీ గౌరవాన్ని కాపాడేందుకు సిరీస్ గెలిచిన జట్టు కెప్టెన్‌కు 'పటౌడీ మెడల్'ను అందించనున్నారు. అయితే, ట్రోఫీ పేరు మాత్రం 'టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ'గానే కొనసాగుతుంది.