Page Loader
మేము ఓడిపోవడానికి కారణమిదే : ధోని సంచలన వ్యాఖ్యలు
చైన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని

మేము ఓడిపోవడానికి కారణమిదే : ధోని సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 01, 2023
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. మొదటి బ్యాటింగ్ చేసిన సీఎస్కే ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 92 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అయినా సీఎస్కే, గుజరాత్ చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమిపై తాజాగా చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని స్పందించాడు. మిడిల్ ఓవర్ బ్యాటర్లు మరింత మెరుగ్గా రాణించాల్సిందని, పిచ్‌పై తేమ ఉందని అందరికి తెలుసని, అయితే మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నా తమ బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారని ధోని చెప్పారు. రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడని, యువ ఆటగాళ్లు ఇలాగే ముందుకు రావాలని ధోని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తుషార్ దేశ్‌పాండే

3.2 ఓవర్లలోనే 51 పరుగులిచ్చిన తుషార్ దేశ్‌పాండే

హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ ఒకానొక దశలో చైన్నై సూపర్ కింగ్స్ 200 దాటుతుందని అనుకున్నానని, అయితే రషీద్ ఖాన్ కలిగి ఉండడం తనకు గొప్ప ఆస్తి అని, అతను వికెట్లు తీస్తూ.. బ్యాటింగ్ రాణించడం గొప్ప విషయమని కొనియాడారు. రెండు వికెట్లు, మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన గుజరాత్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది చెన్నై బౌలర్లలో పేసర్‌ తుషార్ దేశ్ పాండే (ఇంపాక్ట్‌ ప్లేయర్‌) 3.2 ఓవర్లలోనే ఏకంగా 51 పరుగులివ్వడం చైన్నై కొంపముంచింది