
Rohit Sharma : రివ్యూలపై నిర్ణయాన్ని కీపర్, బౌలర్లకే వదిలేశా : రోహిత్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో శ్రీలంకపై అద్భుత విజయంలో టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టింది.
సొంతగడ్డపై జరుగుతున్న ఈ ఈవెంట్‌లో భారత్ సమిష్టి కృషితో ఏడు మ్యాచుల్లో గెలుపొందింది.
లీగ్ దశలో ఇప్పటివరకూ అజేయంగా నిలిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.
ఇక ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా పేసర్ల సంచలన ఆట తీరు అభిమానులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, దుష్మంత చమీర క్యాచును పట్టుకున్నాయి.
అయితే ఆ బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు అయితే రాహుల్ మాత్రం కాన్ఫిడెంట్‌గా అప్పీలు చేయడంతో రోహిత్ శర్మ రివ్యూకు వెళ్లాడు.
Details
సెమీస్ కు చేరడం అనందంగా ఉంది : కేఎల్ రాహుల్
ఈ క్రమంలో బంతి చమీర బ్యాట్ ను తాకినట్లు రివ్యూలో తేలింది. దీంతో అంపైర్ చమీరను అవుట్‌గా ప్రకటించాడు.
ఇదే మ్యాచులో సిరాజ్ బౌలింగ్‌లో రాహుల్ మరో అప్పీలు చేయగా ప్రతికూల ఫలితంవచ్చింది.
ఈ నేపథ్యంలో రివ్యూ సిస్టం గురించి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రివ్యూ తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని తాను పూర్తిగా బౌలర్లు, కీపరకే వదిలేశానని, వాళ్లు డిసైడ్ అయిన తర్వాతే తనకు చెప్పాలని కోరినట్లు రోహిత్ వెల్లడించారు.
శ్రేయస్ అయ్యర్ సత్తా ఉన్న ఆటగాడు అని, అతని సత్తా ఏంటో శ్రీలంక మ్యాచులో చూపించాడని, తాము సెమీస్‌లో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.