LOADING...
Virat Kohli : న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే! 
న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!

Virat Kohli : న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు దుబాయ్‌లో సిద్ధమవుతున్నాయి. అయితే ఈ కీలక పోరుకు ముందు రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. సూపర్ ఫామ్‌లో కోహ్లీ ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో 72.33 సగటుతో 217 పరుగులు చేశాడు. 83.14 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన కోహ్లీ, ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ బాదాడు.

Details

1. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు

ఫైనల్‌లో కోహ్లీ మరో 95 పరుగులు చేస్తే, న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్‌ పేరిట ఉంది. సచిన్ 1750 పరుగులు చేయగా, కోహ్లీ 1656 పరుగులు చేశాడు. 2. న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు ఈ మ్యాచ్‌లో కోహ్లీ శతకం సాధిస్తే, వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుత రికార్డు కోహ్లీ, సెహ్వాగ్‌ ఆరు శతకాలతో సమానంగా నిలిచారు. 3. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక 50+ స్కోర్లు కోహ్లీ ఫైనల్‌లో 50+ పరుగులు చేస్తే, ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక అర్ధశతకాలు చేసిన భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్‌తో సమానమవుతాడు.

Details

4. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు 

ఫైనల్ మ్యాచ్‌లో 128 పరుగులు చేస్తే, ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుత రికార్డు సచిన్ టెండూల్కర్‌ పేరిట ఉంది. ఆయన 657 పరుగులు చేయగా, కోహ్లీ 530 పరుగులు చేశాడు. కోహ్లీ ఈ ఫైనల్‌లో వీటిలో ఎన్ని రికార్డులను అధిగమిస్తాడో వేచి చూడాలి.