Page Loader
World Cup semis: సెమీస్ బెర్తులు ఖరారు.. 15న టీమిండియాతో న్యూజిలాండ్‌ ఢీ 
World Cup semis: సెమీస్ బెర్తులు ఖరారు.. 15న టీమిండియాతో న్యూజిలాండ్‌ ఢీ

World Cup semis: సెమీస్ బెర్తులు ఖరారు.. 15న టీమిండియాతో న్యూజిలాండ్‌ ఢీ 

వ్రాసిన వారు Stalin
Nov 11, 2023
08:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్స్ బెర్తులు శనివారం ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా ఇప్పటకే సమీస్‌కు శనివారం మరో రెండు జట్ల స్థానాలు ఖరారయ్యాయి. నవంబర్ 15న సెమీ-ఫైనల్ 1లో న్యూజిలాండ్‌తో వాంఖడే స్టేడియంలో భారత్ తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో 16న రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ కొనబోతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ వరల్ట్ కప్‌లోనూ 2019 నాటి పోటీనే మళ్లీ పునరావృతమైంది. 2019లో సెమీస్‌లో భారత్- న్యూజిలాండ్ తలపడ్డాయి. కానీ అప్పుడు టీమిడింయా ఓడిపోయింది. ఇప్పుడు అవే రెండు జట్లు మళ్లీ తలపడుతున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా ఢీ