First Hat trick: ప్రపంచ క్రికెట్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది ఈరోజే.. ఆ బౌలర్ ఎవరంటే?
సాధారణంగా క్రికెట్‌లో ఒక మ్యాచులో బౌలర్ 'హ్యాట్రిక్' వికెట్లు తీశాడంటే చాలా ప్రత్యేకత ఉంటుంది. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఈ ఘనతను బౌలర్లు సాధిస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటిసారిగా వరుసగా మూడు వికెట్లు తీసి 'హ్యాట్రిక్' నెలకొల్పిన ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం ఫ్రెడరిక్ స్పోఫోర్త్ పేరిట ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో జనవరి 2వ తేదీనే తొలి హ్యాట్రిక్ నమోదు కావడం గమనార్హం. 1879 జనవరి 2న ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలిమా మధ్య మెల్ బోర్న్ వేదికగా జరిగిన మ్యాచులో ఫ్రెడరిక్ స్పోఫోర్త్ తొలి హ్యాట్రిక్ సాధించాడు.
వన్డేల్లో తొలి హ్యాట్రిక్ ను సాధించిన జలాల్ ఉద్ దిన్
తొలి ఇన్నింగ్స్ లో ఫ్రెడరిక్ 25 ఓవర్లు బౌలింగ్ చేసి 48 పరుగులిచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లు వేసి 7 వికెట్లు పడగొట్టారు. దీంతో మొత్తం మీద ఈ మ్యాచులో 13 వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫ్రెడరిక్ తన పదేళ్ల క్రికెట్ కెరీర్‌లో 18 టెస్టు మ్యాచులు ఆడి 94 వికెట్లను పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్ల ఘన ఏడుసార్లు ఉండగా, పది వికెట్లను నాలుగు సార్లు తీశాడు. ఇక వన్డేల్లో తొలి హ్యాట్రిక్‌ను పాకిస్థాన్ కు చెందిన జలాల్ ఉద్ దిన్ తీయగా, టీ20ల్లో బ్రెట్ లీ 2007లో తొలి హ్యాట్రిక్ ను సాధించాడు.