
T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌కు రోహిత్ శర్మనే సరైన నాయకుడు : జహీర్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రశ్నార్థకంగా మారింది.
ఇక కెప్టెన్సీ ఉండదనే వార్తలు జోరుగా వినిపించాయి. ముఖ్యంగా తర్వలో జరగనున్న టీ20 ప్రపంచకప్ నేతృత్వం ఎవరికి లభిస్తుందనే చర్చ కొనసాగుతోంది.
ప్రపంచ కప్‌లో భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా నడిపించాడు.
ఫైనల్ వరకూ ఒక్క ఓటమి లేకుండా జట్టును ఆగ్రస్థానంలో నిలిపాడు.
అయితే రానున్న టీ20 ప్రపంచ కప్ (T20 World Cup)లో కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తెలియజేశాడు.
కెప్టెన్‌గా అనుభవం ఉన్న రోహిత్ శర్మనే ఎంపిక చేయాలని జహీర్ ఖాన్ (Zaheer Khan) స్పష్టం చేశాడు.
Details
అనుభవం ఉన్నవారికే కెప్టెన్సీని అందజేయాలి
టీ20 ప్రపంచ కప్‌కు సమయం దగ్గర పడుతోందని, సెలెక్టర్లు అనుభవం ఉన్న వారికే కెప్టెన్సీని ఇవ్వాలని జహీర్ ఖాన్ తెలిపాడు.
రోహిత్ శర్మ తో కలిసి ముందుకెళ్లడం మంచి నిర్ణయమని జహీర్ క్రిక్‌బజ్‌తో పేర్కొన్నాడు.
రోహిత్ చాలా కాలంగా జట్టకు ఎనలేని సేవలను అందిస్తున్నాడని, ముఖ్యంగా ఒత్తిడిని తట్టుకొని జట్టుకు ముందుకు తీసుకెళ్తాడని వివరించాడు.
రోహిత్ ఇప్పటికే టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.
మరోవైపు బీసీసీఐ కూడా రోహిత్ శర్మ వైపే మెగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.