Unai simon: గోల్‌పోస్ట్ ముందు అభేద్యమైన గోడ.. అర్జెంటీనాకు అసలు పరీక్ష ఉనై సైమన్!
ఈ వార్తాకథనం ఏంటి
2026 ఫిఫా ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఫ్రాన్స్ స్టార్ క్లియాన్ ఎంబాపె సెమీఫైనల్లో మాత్రం తన ప్రభావాన్ని చూపలేకపోయాడు. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఒక్క గోల్ నమోదు చేయాలన్న అతడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరాలన్న ఆశలు అక్కడికక్కడే ముగిశాయి. ఎంబాపెకు గోల్ చేసే అవకాశమే ఇవ్వకుండా అడ్డుగోడలా నిలిచిన వ్యక్తి స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సైమన్. ఇప్పుడు అదే సైమన్ ఫైనల్లో అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సిని నిలువరించే సవాల్‌కు సిద్ధమవుతున్నాడు.
వివరాలు
క్లబ్ సీజన్‌లో నిరాశ.. ప్రపంచకప్‌కు ముందు విమర్శలు..
ప్రపంచకప్‌కు ముందు జరిగిన క్లబ్ ఫుట్ బాల్ సీజన్‌లో ఉనై సైమన్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయింది.
గోల్‌కీపర్‌గా అతడు మొత్తం 50 గోల్స్‌ను అడ్డుకోలేకపోయాడు. దీంతో స్పెయిన్ జట్టుకు తొలి ఎంపిక గోల్‌కీపర్‌గా ఎవరిని తీసుకోవాలన్న చర్చ జోరందుకుంది.
ముఖ్యంగా సహచర గోల్‌కీపర్ డేవిడ్ రాయా నుంచి అతడికి గట్టి పోటీ ఎదురైంది.
ఈ సీజన్‌లో ప్రీమియర్ లీగ్ గోల్డెన్ గ్లవ్ అవార్డును డేవిడ్ రాయా సొంతం చేసుకోవడంతో సైమన్‌పై సందేహాలు మరింత పెరిగాయి.
అయినప్పటికీ స్పెయిన్ ప్రధాన కోచ్ లూయీస్ డి లా ఫ్యూయెంటా మాత్రం సైమన్‌పైనే పూర్తి విశ్వాసం ఉంచి తుది జట్టులో అవకాశం కల్పించాడు.
వివరాలు
ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో రికార్డుల వేట..
ప్రపంచకప్‌లో మాత్రం ఉనై సైమన్ పూర్తిగా భిన్నమైన రూపాన్ని చూపించాడు.
స్పెయిన్ ఎదుర్కొన్న ఏడు ప్రత్యర్థి జట్లలో బెల్జియం మినహా మిగిలిన ఏ జట్టూ ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది.
దీంతో సైమన్ ఆరు క్లీన్‌షీట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో 96 ఏళ్లలో ఒకే టోర్నీలో ఆరు క్లీన్‌షీట్లు నమోదు చేసిన తొలి గోల్‌కీపర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు.
అంతకుముందు ఒక టోర్నీలో అత్యధికంగా ఐదు క్లీన్‌షీట్లు నమోదు చేసిన రికార్డు ఏడుగురు గోల్‌కీపర్ల పేరిట ఉండేది.
అంతేకాదు, ప్రపంచకప్‌లో వరుసగా 630 నిమిషాల పాటు ప్రత్యర్థులకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా నిలిచిన గోల్‌కీపర్‌గా కూడా సైమన్ ప్రత్యేక గుర్తింపు పొందాడు.