Page Loader
Pakistan : భారత్‌తో మ్యాచ్ మాకు గుణపాఠం: పాక్ బౌలింగ్ కోచ్ 
భారత్‌తో మ్యాచ్ మాకు గుణపాఠం : పాక్ బౌలింగ్ కోచ్

Pakistan : భారత్‌తో మ్యాచ్ మాకు గుణపాఠం: పాక్ బౌలింగ్ కోచ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2023
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2023 గ్రూప్-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా ఈ మ్యాచులో పాకిస్థాన్ స్పిన్నర్లు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. దీనికి తోడు పాకిస్థాన్ పేస్ బౌలర్ నషీమ్ షా గాయం కారణంగా ఆ జట్టు నుంచి వైదొలగాడు. ఈ నేపథ్యంలో పాక్ బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పందించాడు. భారత్‌తో మ్యాచు తర్వాత తాము నిరుత్సాహ పడ్డామని పేర్కొన్నారు. తమ స్పిన్నర్లు పుంజుకొని శ్రీలంకతో జరిగే మ్యాచులో రాణిస్తారని మోర్నే మోర్కెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Details

శ్రీలంకతో జరిగే మ్యాచులో కచ్చితంగా రాణిస్తారు

మొదటి నుంచి భారత బ్యాటర్లు తమపై అధిపత్యం చూపారని, ఇక టీమిండియా బ్యాటర్ల ఒత్తిడితో తమ బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్లారని మోర్నే మోర్కెల్ పేర్కొన్నారు. తమ బౌలర్లు ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా అవసరమని, ప్రపంచ కప్‌కు ముందు ఇది మాకో గుణపాఠమని, ఇవాళ శ్రీలంకతో జరిగే మ్యాచులో తమ స్పిన్నర్లు జుంజుకొని రాణిస్తారని చెప్పారు. ఇక శ్రీలంకతో జరిగే మ్యాచుకు స్టార్ పేసర్ నసీమ్ షా లేకపోవడం తమ జట్టుకు పెద్ద లోటు అన్నారు. అయితే కొత్తగా జట్టులోకి వచ్చేవారికి ఇదోక అద్భుతమైన అవకాశమని, నసీమ్ షా స్థానంలో జమాన్ ఖాన్ జట్టులోకి వచ్చారని మోర్నే మోర్కెల్ వెల్లడించారు.