Ind Vs Afg: వర్షం వల్ల మ్యాచ్ రద్దు.. ఆసియా గేమ్స్‌కు టీమిండియాలో గోల్డ్ మెడల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా గేమ్స్‌లో పురుషుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అప్గనిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో టాప్ సీడింగ్‌లో ఉన్న భారత్‌ను స్వర్ణ పతకం వరించింది.
టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో తొలుత టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ సేన బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో భారత బౌలర్ల ధాటికి 13 పరుగులకే అప్గన్ 3 కీలక వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో షమీదుల్లా 49, కెప్టెన్ గులాబదిన్ నయీబ్ 24 బంతుల్లో 27 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు.
వరుణుడి అంతరాయంతో 18.2 ఓవర్లలో అప్గాన్ 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.
Details
102 పతకాలతో భారత్ నాలుగో స్థానం
ఆ తర్వాత వర్షం పడుతూనే ఉండటంతో మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
ఈ క్రమంలో ఐసీసీ ర్యాకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు స్వర్ణం సాధించింది.
ఇక భారత మహిళల క్రికెట్ జట్టు కూడా గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.
ఈ విజయంతో భారత్ పసడి పతకాల సంఖ్య 27కు చేరింది.
మొత్తంగా 35 రజతాలు, 40 కాంస్య పతకాలు రావడంతో 102 పతకాలను సాధించి, పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.