Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీకి ఆ మిస్టరి స్పిన్నర్ ని ఎంపిక చేయాలి : రవిచంద్రన్ అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌ల్లో భాగంగా టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో 14 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్లతో చక్రవర్తి గట్టి ప్రదర్శన కనబరిచాడు.
ఈ క్రమంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, ఫిబ్రవరి 6 నుండి ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో వరుణ్‌కు అవకాశం ఇవ్వాలని సూచించాడు.
ఇంతకుముందు వరుణ్ చక్రవర్తి వన్డే మ్యాచ్‌ల్లో ఆడలేదు. అందువల్ల అశ్విన్ వన్డే సిరీస్‌లో వరుణ్‌కు అవకాశాన్ని ఇవ్వాలని భావించారు.
ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో వరుణ్‌కు అవకాశం ఇవ్వడం మంచిదన్నారు.
Details
అదనపు స్పిన్నర్ గా జట్టులో చేర్చుకోవాలి
ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అతన్ని ఎంపిక చేయడం సులభం కాదని, ఈ సిరీస్‌లో అతన్ని ఆడించాల్సిన అవసరం ఉందని అశ్విన్ వ్యాఖ్యానించారు.
భారత జట్టు ప్రొవిజినల్ స్క్వాడ్‌ను ప్రకటించిన నేపథ్యంలో, వరుణ్‌ను అంగీకరించి, ఒక అదనపు స్పిన్నర్‌గా జట్టులో చేర్చుకోవడం గొప్ప అవకాశం అని అశ్విన్ పేర్కొన్నారు.
ఫిబ్రవరి 11 వరకు మార్చుకునే అవకాశం ఉండటంతో జట్టు ఎంపికలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
వరుణ్ చక్రవర్తి తన అద్భుత ప్రదర్శనతో మరింత ఎదగాలని అశ్విన్ ఆకాంక్షించారు.