Page Loader
Paris Olympics : కళ్లు జిగేల్ మనిపించేలా పారిస్ వేడుకలు ప్రారంభం

Paris Olympics : కళ్లు జిగేల్ మనిపించేలా పారిస్ వేడుకలు ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2024
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ 2024 ఒలింపిక్స్ వేడుకలు కళ్లు జిగేల్ మనేలా ప్రారంభమయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ వేడుకలు మొదలయ్యాయి. దిగ్గజ ఫుట్‌బాలర్ జినేదిన్ జిదాన్ ఒలింపక్ టార్చ్ పట్టుకొని పరెగెత్తగా, అతనితో పాటు కొంతమంది చిన్నారులు పడవలో ప్రయాణించడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలైంది. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సెన్ నదిపై వేడుకలను ఫ్రాన్స్ నిర్వహించింది. ముందు ఎప్పుడూ వేడుకలు స్టేడియంలో మాత్రమే జరిగేవి.

Details

భారత్ తరుఫున పరేడ్ లో పాల్గొన్న 78 మంది అథ్లెట్లు

ఒలింపిక్ జ్యోతి వెలిగించే ముందు రాఫెల్ నాదల్, జినెడిన్ జిదానే, సెరెనా విలియమ్స్‌తో సహా లెజెనరీ అథ్లెట్లను సిబ్బంది సత్కరించారు. ఇక ఒలింపిక్స్ ఆద్యులైన గ్రీస్ బృందం తొలుత పరేడ్ నిర్వహించగా, ఆ తర్వాత ఫ్రెంచ్ నిర్వహించింది. ఇక అక్షర క్రమంలో భారత్ 84వ స్థానంలో పరేడ్‌లో పాల్గొంది. భారత్ తరుఫున పివి.సింధు, శరత్ కమల్ పతకధారులగా వ్యవహరించారు. మొత్తంగా 78 మంది ఈ పరేడ్‌లో పాల్గొన్నారు.

Details

సెన్ నదిపై 6 కిలోమీటర్ల వరకు పరేడ్

సెన్ నదిపై సూమారుగా 6 కిలోమీటర్ల వరకు ఈ పరేడ్‌ను నిర్వహించారు. 85 పడవలపై సూమారుగా 6800 మంది అథ్లెట్లు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలకు చూసేందుకు దాదాపుగా 3.20 లక్షల మంది ప్రేక్షకులు హాజరు కాగా, నది పరిసరాల్లో మొత్తం 80 భారీ తెరలను ఏర్పాటు చేశారు. జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 10,500 మంది అథ్లెట్లు పోటీపడతారు.