Page Loader
Rohit Sharma: క్రికెట్‌లో రికార్డుల బాహుబలి.. నేడు రోహిత్ శర్మ బర్తడే!
క్రికెట్‌లో రికార్డుల బాహుబలి.. నేడు రోహిత్ శర్మ బర్తడే!

Rohit Sharma: క్రికెట్‌లో రికార్డుల బాహుబలి.. నేడు రోహిత్ శర్మ బర్తడే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2025
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు. హిట్‌మ్యాన్ రోహిత్ 37వ వసంతం పూర్తి చేసుకుని 38వ ఏట అడుగుపెడుతున్నాడు. భారత్ తరఫున వరుసగా ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన రోహిత్‌.. తన బ్యాటింగ్‌తో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ సందర్భంగా కేవలం రోహిత్‌కే సాధ్యమైన కొన్ని రికార్డులను ఓసారి గుర్తు చేసుకుందాం. వన్డేల్లో రికార్డుల రారాజు వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ పేరుతో ఎన్నో అపురూపమైన రికార్డులున్నాయి. మూడు డబుల్ సెంచరీలు చేశాడు అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు ఏ బ్యాటర్ సాధించలేని ఈ ఘనత రోహిత్‌ది. అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా అతడిదే 264 పరుగులు.

Details

ఒకే ఇన్నింగ్స్ లో 33 ఫోర్లు

2014 నవంబర్ 13న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకపై ఈ అరుదైన స్కోరు నమోదు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో రోహిత్ 33 ఫోర్లు, 9 సిక్సులు బాదాడు. ఒక ఇన్నింగ్స్‌లో టీమంతా చేసే స్కోరును ఒక్కడే చేసి చూపించాడు. వన్డే వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు 2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒకే వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. తాను ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

Details

టీ20ల్లోనూ రికార్డే

తక్కువ ఓవర్ల ఫార్మాట్ అయినా రోహిత్ శర్మ తన ప్రావీణ్యం చూపించాడు. ఇప్పటివరకు అతడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు చేశాడు. ఇందులో ఒకటి కేవలం 35 బంతుల్లోనే పూర్తి చేయడం గమనార్హం. సిక్సర్ల కింగ్ రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కలిపి 637 సిక్సులు బాదాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికం. ఐసీసీ వన్డే టోర్నీల్లో (వరల్డ్‌కప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ) 68 సిక్సులతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అంతేకాదు, ఆస్ట్రేలియా బౌలర్లపై 132 సిక్సులు బాదాడు. ఇది కూడా ప్రపంచ రికార్డే. రోహిత్‌ 264 పరుగుల ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు బాది మరో రికార్డు నెలకొల్పాడు. ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.

Details

అభిమానుల నుండి అభినందనల వెల్లువ

రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. అతడి అద్భుతమైన కెరీర్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. మొత్తం మీద హిట్‌మ్యాన్‌ రికార్డులు మామూలు విషయాలు కావు... ఇవి కేవలం గొప్ప బ్యాటర్‌కే సాధ్యం. హ్యాపీ బర్త్‌డే రోహిత్ శర్మ!