Page Loader
IND vs AUS: బ్రిస్బేన్‌లో మూడో టెస్టు.. భారత జట్టుకు కఠిన పరీక్షే!
బ్రిస్బేన్‌లో మూడో టెస్టు.. భారత జట్టుకు కఠిన పరీక్షే!

IND vs AUS: బ్రిస్బేన్‌లో మూడో టెస్టు.. భారత జట్టుకు కఠిన పరీక్షే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2024
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టుకు గబ్బా మైదానంలో మరోసారి పేస్ బౌలింగ్‌కు పెద్ద సవాలు ఎదురుకానుంది. క్రిస్మస్ తర్వాత కాకుండా ఈసారి వేసవి ఆరంభంలోనే మూడో టెస్టు జరగడం, గబ్బా పిచ్‌కు పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. క్యురేటర్ డేవిడ్‌ సుందర్‌స్కీ మాటల ప్రకారం, సీజన్‌ ప్రారంభంలో పిచ్ కొత్తగా ఉండి పేస్ బౌలర్లకు భారీ మద్దతు అందిస్తుంది. 2021లో ఇక్కడ టీమిండియా రిషబ్ పంత్‌ అద్భుత ఇన్నింగ్స్‌ తో చారిత్రక విజయం సాధించింది. 1988 తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియా ఓడిపోవడం ఆ తొలిసారి. అయితే ఆ మ్యాచ్ జనవరిలో జరిగింది.

Details

భిన్నంగా పిచ్ పరిస్థితులు

ఈ సారి టెస్టు ముందు వర్ష సూచనతో పిచ్ మరింత చల్లబడే అవకాశం ఉంది. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌కు పెద్ద సవాలుగా మారనుంది. గబ్బాలో సీజన్‌ మధ్య లేదా ఆఖర్లో జరిగిన మ్యాచ్‌లతో పోలిస్తే, సీజన్‌ ఆరంభంలో పిచ్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని క్యురేటర్ తెలిపారు. గులాబీ బంతితో ఇటీవల జరిగిన దేశవాళీ మ్యాచ్‌లో తొలి రోజు 15 వికెట్లు పడటం గబ్బా పిచ్‌ భవిష్యత్తు గురించి సూచనలిచ్చింది. బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ 1-1తో సమం కాగా, మూడో టెస్టు శనివారం ప్రారంభం కానుంది. భారత జట్టు ఇప్పటికే బ్రిస్బేన్ చేరుకుంది.

Details

గబ్బా పిచ్ పై ఆస్ట్రేలియాకు మంచి రికార్డు

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ మ్యాచ్ కీలకంగా మారబోతోంది. గబ్బా పిచ్‌పై ఆడిన 61 టెస్టుల్లో ఆస్ట్రేలియా కేవలం ఏడుసార్లు మాత్రమే ఓడింది. అయితే క్రిస్మస్ తర్వాత జరిగిన టెస్టుల్లో ఆస్ట్రేలియా రికార్డు బలహీనంగా ఉంది. బ్రిస్బేన్‌లో వర్ష సూచన, పిచ్‌కు సహకారంతో ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారనుంది. గబ్బా టెస్టులో భారత్‌కు బ్యాటింగ్ కీలక పరీక్షగా నిలుస్తుంది. పేస్, బౌన్స్‌తో కూడిన పిచ్‌ను ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు సన్నద్ధంగా ఉండాల్సి ఉంది. గతంలో ఇక్కడ సాధించిన చారిత్రక విజయం ఈసారి స్ఫూర్తి అందించనుంది.