
ICC Cricket World Cup : ఐసీసీ ప్రపంచ కప్‌లో ఉత్కంఠంగా సాగిన టాప్-5 మ్యాచులివే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా అక్టోబర్ 5నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
1983లో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని భారత్ ముద్దాడింది. అయితే ఐసీసీ టోర్నీలో ఇప్పటివరకూ జరిగిన కొన్ని మ్యాచులు క్రికెట్ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియా vs వెస్టిండీస్, మాంచెస్టర్, 1983
ప్రపంచ జట్లలో అగ్రస్థానంలో నిలిచిన వెస్టిండీస్ జట్టుని 1983లో టీమిండియా చిత్తు చేసింది.
కపిల్ దేవ్ కెప్టెన్సీలో జరిగిన ఈ మ్యాచులో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసి, మొదటిసారిగా భారత్ కు వరల్డ్ కప్ ట్రోఫీని అందజేశారు.
ఈ మ్యాచులో టీమిండియా 34 పరుగుల తేడాతో గెలుపొంది.
Details
ఇండియాను మట్టికరిపించిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ vs ఇండియా, ట్రినిడాడ్, 2007
1983 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. 2007లో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన భారత్, బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైంది.
ఈ మ్యాచులో బంగ్లా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇంగ్లండ్ vs ఐర్లాండ్, బెంగళూరు, 2011
2011లో ప్రపంచ కప్ చరిత్రలో ఇంగ్లండ్‌ను ఐర్లాండ్ ఓడించింది.
కెవిన్ ఓ'బ్రియన్ అద్భుత ప్రదర్శన కారణంగా ఐర్లాండ్ 327 పరుగుల టార్గెట్ ను ఐర్లాండ్ చేధించి, మూడు పరుగుల తేడాతో గెలిచింది.
కెవిన్ ఓ బ్రియన్ సెంచరీతో చెలరేగడంతో ఐర్లాండ్ ఐదు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను పూర్తి చేసింది.
Details
బంగ్లా చేతిలో ఓడిన ఇంగ్లండ్
కీనా vs శ్రీలంక, నైరోబి, 2003
2003 ప్రపంచకప్ సమయంలో కెన్యా జట్టు సంచలనం సృష్టించింది. శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లను మట్టికరిపించి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.
ఇక సెమీఫైనల్ మ్యాచులో భారత్ చేతిలో ఓడి కెన్యా ఇంటిదారి పట్టింది.
అయితే శ్రీలంక తో జరిగిన మ్యాచులో కెన్యా 210 పరుగులు చేసింది. ఇక లక్ష్య చేధనకు బంగ్లాను 157 పరుగులకే కెన్యా కట్టడి చేసింది.
ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్, అడిలైడ్, 2015
2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ నాకౌట్ దశలో ఇంటిదారి పట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో బంగ్లాదేశ్ చేతిలో ఇంగ్లండ్ పరాజయం పాలైంది.
మహ్మదుల్లా సెంచరీతో చేయడంతో బంగ్లా 275 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 260 పరుగులకు ఆలౌటైంది.