LOADING...
Yuzvendra Chahal: దేశం మొత్తం తెలుసు మహ్‌వశ్‌తో రిలేషన్‌పై పరోక్ష హింట్ ఇచ్చిన చహల్!
దేశం మొత్తం తెలుసు మహ్‌వశ్‌తో రిలేషన్‌పై పరోక్ష హింట్ ఇచ్చిన చహల్!

Yuzvendra Chahal: దేశం మొత్తం తెలుసు మహ్‌వశ్‌తో రిలేషన్‌పై పరోక్ష హింట్ ఇచ్చిన చహల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2025
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మల విడాకుల వార్తలపై అంతా ఊహించినట్లుగానే, ఇప్పుడు చహల్ కొత్త రిలేషన్‌షిప్‌లో ఉన్నారని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. 2020లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2025లో విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చహల్ సోషల్ మీడియాలో ఆర్జే మహ్‌వశ్‌తో తరచూ కనిపిస్తూ ఉండటంతో, వీరి మధ్య ప్రత్యేక బాండ్ ఉందని వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ సంబంధాన్ని చహల్ పరోక్షంగా అంగీకరించినట్లు కనిపిస్తోంది.

Details

కపిల్ షోలో 'మిస్టరీ గర్ల్'పై ప్రశ్న.. చహల్ పరోక్ష సమాధానం

చహల్ ఇటీవల గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్, అభిషేక్ శర్మలతో కలిసి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొన్నాడు. ఈ షోలో హోస్ట్ కపిల్ శర్మ సరదాగా 'మిస్టరీ గర్ల్' గురించి చహల్‌ను ప్రశ్నించాడు. దానికి చహల్ 'ఇప్పటికే దేశం మొత్తం తెలుసు' అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. వెంటనే రిషబ్ పంత్ జోక్ చేస్తూ విడాకుల తర్వాత యూజీ స్వేచ్ఛా మనిషయ్యాడు అంటూ వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు వెల్లివిరిశాయి. ఈ సంభాషణ అనంతరం, నెటిజన్లు చహల్-మహ్‌వశ్ మధ్య ప్రేమ నిజమే అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Details

మహ్‌వశ్ ఎవరు?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మహ్‌వశ్, ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ పూర్తిచేశారు. యూట్యూబ్ ప్రాంక్ వీడియోలతో ఫేమస్ అయిన ఆమె, రేడియో జాకీగా కూడా గుర్తింపు పొందారు. తాజాగా ఆమె బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టి 'ప్యార్, పైసా ఔర్ ప్రాఫిట్' అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. యుజ్వేంద్ర చహల్‌తో కలిసి ఆమె డిన్నర్ డేట్స్, టీమిండియా మ్యాచ్‌లకు హాజరవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.