ICC World Cup 2023: భారత్‌కు చేరుకున్న వరల్డ్ కప్ ట్రోఫీ.. తాజ్‌మహల్ ముందు ప్రదర్శించిన ఐసీసీ
ఈ వార్తాకథనం ఏంటి
18 దేశాల పర్యటనలో భాగంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీ భారత్‌కు చేరుకుంది. మరో 50 రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ సమరం మొదలు కానుంది.
ఇప్పటికే ఐసీసీ ప్రమోషన్స్ ను షురూ చేసింది. దేశంలోనే చరిత్రాత్మక కట్టడం తాజ్ మహల్ వద్ద ట్రోఫీని ప్రదర్శించినట్లు ఐసీసీ తెలిపింది.
ప్రస్తుతం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజ్ మహల్ ముందు ఉన్న ఈ ట్రోఫీని చూడటానికి ప్రస్తుతం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.
బంగ్లాదేశ్, కువైట్, బెహ్రయిన్ దేశాలు తిరిగొచ్చి ట్రోఫీ ఇండియాకు చేరుకుంది. జూన్ 27న భారత్‌లో మొదలైన ఈ ట్రోఫీ టూరు అనేక దేశాలు తిరిగొచ్చి ఇప్పుడు ఆగ్రాకు చేరుకుంది.
Details
అక్టోబర్ 5న వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం
ఇండియా పర్యటన ముగిసిన అనంతరం ఈ ట్రోఫీ న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, పాకిస్థాన్ సహా 18 దేశాలను తిరిగి, మళ్లీ సెప్టెంబర్ 4న ఇండియాకు తిరిగి రానుంది.
వన్డే వరల్డ్ కప్ టోర్నీ అక్టోబర్ 5నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచుతో ఈ టోర్నీ ముగియనుంది.
ఇండియా వేదికగా ఈ టోర్నీ జరుగుతుండటంతో టీమిండియా జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
2011లో స్వదేశంలో వరల్డ్ కప్ ను గెలిచి భారత జట్టు, మళ్లీ అదే సీన్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.