Page Loader
AUS vs WI: టెస్టు చరిత్రలో అత్యంత చెత్త రికార్డు.. 27 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్!
టెస్టు చరిత్రలో అత్యంత చెత్త రికార్డు.. 27 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్!

AUS vs WI: టెస్టు చరిత్రలో అత్యంత చెత్త రికార్డు.. 27 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ దారుణమైన అధ్యాయం జమైకాలోని సబినా పార్క్‌ స్టేడియంలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులకే ఆలౌట్‌ కావడం సంచలనంగా మారింది. ఈ స్కోరు టెస్ట్‌ చరిత్రలో రెండో అతి తక్కువగా నమోదైంది. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ పూర్తి‌గా దెబ్బతింది. ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్‌ కాగా, మిగిలిన నలుగురిలో ముగ్గురు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆశ్చర్యకరంగా, 6 ఎక్స్‌ట్రా పరుగులే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా నిలిచాయి. ఆ ఎక్స్‌ట్రాలు లేకుంటే వెస్టిండీస్‌ కేవలం 21 పరుగులకే కుప్పకూలేది. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో మిచెల్‌ స్టార్క్‌ విధ్వంసం సృష్టించాడు.

Details

ఆరు వికెట్లతో చెలరేగిన స్టార్క్

అతను 7.3 ఓవర్లలో 4 మెయిడిన్‌లు వేయడంతో పాటు కేవలం 9పరుగులకే 6వికెట్లు తీసి వెస్టిండీస్‌ను కుప్పకూల్చాడు. స్కాట్‌ బొలాండ్‌ 2ఓవర్లలో 3వికెట్లు, జోష్‌ హేజిల్‌వుడ్‌ ఒక వికెట్‌ తీశారు. ఈ పరాభవంతో వెస్టిండీస్‌ 1955లో న్యూజిలాండ్‌ 26 పరుగులకు ఆలౌట్‌ అయిన రికార్డుకు కాస్త మాత్రమే తక్కువగా నిలిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులు, వెస్టిండీస్‌ 143 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 27 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ 176 పరుగుల తేడాతో గెలుపొందింది. వెస్టిండీస్‌ చివరి ఇన్నింగ్స్‌లో విజయం సాధించాలన్న ఆశలు ఉన్నప్పటికీ, పిచ్‌ నుంచి స్వింగ్‌ సాయంగా ఉండడంతో ఆసీస్‌ బౌలర్లు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా స్టార్క్‌ దెబ్బతో వెస్టిండీస్‌ బ్యాటర్లు పూర్తిగా కుదేలయ్యారు.