Cricket : టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ సగటును కలిగిన బ్యాటర్లు వీరే
ఈ వార్తాకథనం ఏంటి
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో సాధించింది.
దీంతో రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 2-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది.
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ తన రెండో ఇన్నింగ్స్‌లో (109) సెంచరీ సాధించాడు.
ఇదిలా ఉంటే, టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Details
అత్యధిక సగటుతో మొదటి స్థానంలో డాన్ బ్రాడ్‌మాన్
డాన్ బ్రాడ్‌మాన్ (99.94) 1928- 1948 మధ్య ఆస్ట్రేలియా తరపున 52 టెస్టులు ఆడిన డాన్ బ్రాడ్‌మాన్ 99.94 సగటుతో 6,996 పరుగులు చేశాడు.
బ్రాడ్‌మాన్ తన చివరి టెస్టులో డకౌట్ కావడంతో సగటు 100ను సాధించలేకపోయాడు.
అయితే టెస్టు క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన రికార్డు ఇప్పటికీ బ్రాడ్‌మాన్ పేరిట ఉండడం విశేషం.
Details
టెస్టుల్లో ఐదు సెంచరీలు సాధించిన హ్యారీ బ్రూక్
ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక తన టెస్ట్ కెరీర్‌ను 2022లో ప్రారంభించాడు.
అతను 14 టెస్టు మ్యాచ్‌ల్లో 62.54 సగటుతో 1,376 పరుగులు చేశాడు.
ఇక టెస్టుల్లో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్లలో రెండో స్థానంలో హ్యారీ బ్రూక్ నిలిచాడు.
ఇప్పటివరకూ తన టెస్టు కెరీర్‌లో 5 సెంచరీలతో పాటు 8 హాఫ్ సెంచరీలను సాధించాడు.
Details
2015లో టెస్టుల్లో అరంగ్రేటం చేసిన ఆడమ్ వోజెస్
ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ ఆడమ్ వోజెస్ జూన్ 2015లో తన టెస్టు అరంగేట్రం చేశాడు.
తన టెస్ట్ కెరీర్‌లో 20 మ్యాచులాడి 61.87 సగటుతో 1,485 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించాడు.
అత్యధికంగా టెస్టుల్లో (269*) పరుగులను బాదాడు.
Details
1970లో చివరి టెస్టును ఆడిన గ్రేమ్ పొలాక్
దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ గ్రేమ్ పొలాక్ 1963లో టెస్టుల్లో అరంగేట్రం చేసి 1970లో చివరి టెస్టును ఆడాడు.
అతను 23 టెస్టుల్లో 60.97 సగటుతో 2,256 పరుగులు చేశాడు.
ఇందులో 7 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.