Page Loader
Most Runs Without Century: సెంచరీ చేయకుండానే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీరే!
సెంచరీ లేకుండానే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీరే!

Most Runs Without Century: సెంచరీ చేయకుండానే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 29, 2024
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో ఇప్పటివరకు బ్యాటర్ల నుంచి భారీ పరుగులు సాధించాలని, బౌలర్లు కీలక వికెట్లు తీయాలని అంచనాలు ఉండేవి. ఇప్పుడు టెయిలెండర్ల నుంచి కూడా మెరుగైన పరుగులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా చేయకుండానే అత్యధిక పరుగులు చేసిన కొందరు క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. 1.షేన్ వార్న్(ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ అయిన షేన్ వార్న్ తన కెరీర్‌లో 339 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 4172 పరుగులు చేశారు. కానీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 145 టెస్టుల్లో 3154 పరుగులు చేసిన వార్న్, 2001లో న్యూజిలాండ్‌పై 99 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. 194 వన్డేల్లో 1018 పరుగులు చేసిన వార్న్ మొత్తం 13 హాఫ్‌ సెంచరీలు సాధించాడు.

Details

2. కాలిన్స్ ఒబుయా (కెన్యా) 

కెన్యా ఆల్‌రౌండర్‌ కాలిన్స్ ఒబుయా 179 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 3786 పరుగులు చేసి, రెండు దశాబ్దాలు ఆడినా సెంచరీ చేయలేదు. 104 వన్డేల్లో 2044 పరుగులు సాధించిన ఈ ఆటగాడు అత్యధికంగా 98* పరుగులు చేశాడు. ఒబుయా 20 హాఫ్‌ సెంచరీలు సాధించడమే కాకుండా 75 టీ20ల్లో 1742 పరుగులు చేశాడు. 3. చము చిభాభా (జింబాబ్వే) జింబాబ్వే క్రికెటర్‌ చము చిభాభా 150 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 3316 పరుగులు చేశాడు. 22 హాఫ్‌ సెంచరీలు సాధించిన చిభాభా, 2015లో పాకిస్థాన్‌పై 99 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. 109 వన్డేల్లో 2474 పరుగులు చేయగా, ఐదు టెస్టుల్లో 175 పరుగులు చేశాడు.

Details

4. టిమ్ సౌథీ (న్యూజిలాండ్) 

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్‌ టిమ్ సౌథీ 387 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 3141 పరుగులు చేసినప్పటికీ, ఒక్క సెంచరీ కూడా చేయలేదు. టెస్టుల్లో ఆరు హాఫ్‌ సెంచరీలతో 2098 పరుగులు, వన్డేల్లో 740 పరుగులు, టీ20ల్లో 303 పరుగులు చేశాడు. 5.మష్రఫే మోర్తజా (బంగ్లాదేశ్) బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజా 310 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 2961 పరుగులు చేసి, 13.45 యావరేజ్‌తో నాలుగు హాఫ్‌ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 797 పరుగులు, వన్డేల్లో 1787 పరుగులు, టీ20ల్లో 377 పరుగులు చేశాడు. ఈ ఆటగాళ్లు తమ ప్రత్యేకతలతో క్రికెట్‌లో నిలిచిపోగా, బ్యాటింగ్‌లోనూ మంచి పరుగులు సాధించి అభిమానులను ఆకట్టుకున్నారు.