8 days for IPL 2026: సిక్సర్ల వర్షం కురిపించే ఎనిమిది మంది స్టార్ బ్యాటర్లు వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా టోర్నమెంట్‌లో దూకుడు, భారీ షాట్లతో అభిమానులను అలరించే బ్యాటర్లపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా "మోస్ట్ సిక్సెస్" రేస్‌లో ఎవరు ముందుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టే అవకాశమున్న 8 మంది కీలక ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
Details
1. అభిషేక్ శర్మ (సన్ రైజర్స్ హైదరాబాద్)
అభిషేక్ శర్మ గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2025లో 439 పరుగులు చేసి, 28 సిక్సర్లు బాదాడు. మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో 77 మ్యాచ్‌లలో 1,816 పరుగులు చేసి, 101 సిక్సర్లు నమోదు చేశాడు. పవర్‌ప్లే నుంచే బౌలర్లపై విరుచుకుపడే సామర్థ్యం అతనికి ఉంది. ప్రస్తుతం T20ల్లో 500 సిక్సర్లకు చేరువలో ఉన్నాడు. 2. సూర్యకుమార్ యాదవ్ (ముంబయి ఇండియన్స్) సూర్యకుమార్ యాదవ్ అంటేనే అద్భుత షాట్లు, 360 డిగ్రీల బ్యాటింగ్ గుర్తుకు వస్తాయి. ఐపీఎల్ 2025లో 717 పరుగులు చేసి, 38 సిక్సర్లు బాదాడు. మొత్తం ఐపీఎల్ 4,311 పరుగులు, 168 సిక్సర్లు ఉన్నాయి. టీ20ల్లో ఇప్పటికే 419 సిక్సర్లు కొట్టాడు.
Details
3. మిచెల్ మార్ష్ (లక్నో సూపర్ జెయింట్స్)
ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ మార్ష్ కూడా భారీ హిట్టర్. గత సీజన్‌లో 627 పరుగులు చేసి, 37 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 75 సిక్సర్లు ఉన్నాయ. మొత్తం T20ల్లో 300 సిక్సర్లకు దగ్గరలో ఉన్నాడు. 4. నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్) పవర్ హిట్టింగ్‌కు ప్రసిద్ధి చెందిన నికోలస్ పూరన్ గత సీజన్‌లో 524 పరుగులు, 40 సిక్సర్లు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో 2,293 పరుగులు చేసి, 167 సిక్సర్లు బాదాడు. టీ20ల్లో కూడా 700కి పైగా సిక్సర్లు బాదాడు.
Details
5. ఇషాన్ కిషన్ (సన్ రైజర్స్ హైదరాబాద్ )
ఇషాన్ కిషన్ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు 134 సిక్సర్లు కొట్టిన అతను 3,000 పరుగులకు చేరువలో ఉన్నాడు. టీ20ల్లో 300కి పైగా సిక్సర్లు బాదిన అనుభవం ఉంది. ఈ సీజన్‌లో సన్ రైజర్స్ కెప్టెన్ కూడా ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు. 6. శ్రేయస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్) పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గత సీజన్‌లో 604 పరుగులు చేసి, 39 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ లో మొత్తం 3,731 పరుగులు, 152 సిక్సర్లు ఉన్నాయి. టీ20ల్లో 286 సిక్సర్లు బాదాడు.
Details
7. హెన్రిచ్ క్లాసెన్ (సన్ రైజర్స్ హైదరాబాద్)
దక్షిణాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ తన పవర్ హిట్టింగ్‌తో మ్యాచులను మలుపు తిప్పగలడు. ఐపీఎల్ 2025లో 487 పరుగులు చేసి, 25 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ లో 89 సిక్సర్లు ఉన్న అతను టీ20ల్లో 341 సిక్సర్లు సాధించాడు. 8. సంజు శాంసన్ (చైన్నై సూపర్ కింగ్స్) ఈ సీజన్‌లో చెన్నై జట్టుకు మారిన సంజు శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు 219 సిక్సర్లు బాదిన అతను టీ20ల్లో 400 సిక్సర్లకు చేరువలో ఉన్నాడు. ఈసారి కూడా భారీ షాట్లతో ఆకట్టుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ ఆటగాళ్లు తమ దూకుడు బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా "మోస్ట్ సిక్సెస్" రేస్‌లో పోటీ పడే అవకాశముంది.