IPL 2025: ఐపీఎల్‌లో వేగవంతమైన అర్ధశతకాలు.. రికార్డులు సృష్టించిన ప్లేయర్స్ వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ పెద్దలు ఏర్పాట్లను పూర్తిచేశారు.
ఈ టోర్నీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి సీజన్ లోనూ ప్లేయర్లు సిక్సర్ల వర్షం కురిపించి అభిమానులు అలరిస్తున్నారు. అయితే ఐపీఎల్ మొత్తం టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యశస్వి జైస్వాల్ - 13 బంతులు
రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డు సొంతం చేసుకున్నాడు.
2023 మే 11న కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కేవలం 13 బంతుల్లోనే 50 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.
Details
కేఎల్ రాహుల్ - 14 బంతులు
కేఎల్ రాహుల్ 2018 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 బంతుల్లోనే అర్ధశతకం* సాధించి రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు.
పాట్ కమిన్స్ - 14 బంతులు
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 14 బంతుల్లోనే 56 పరుగులు చేయడంతో ఈ జాబితాలో చోటు సంపాదించాడు.
ఇషాన్ కిషన్ - 16 బంతులు
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 2024 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.
Details
అభిషేక్ శర్మ - 16 బంతులు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 2024 మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 50 పరుగులు చేసి సత్తా చాటాడు.
యూసఫ్ పఠాన్ - 15 బంతులు
భారత మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి, తన హిట్టింగ్ పవర్‌ను ప్రదర్శించాడు.
సునీల్ నరైన్ - 15 బంతులు
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు సునీల్ నరైన్ 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 15 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఈ జాబితాలో చోటు సంపాదించాడు.
Details
నికోలస్ పూరన్ - 15 బంతులు
వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ 2023లో లక్నో తరుపున ఆడి, బెంగుళూర్ పై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
జేక్ ఫ్రేజర్ మెకెర్క్- 15 బంతులు
ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెకెర్క్ 2024 ఐపీఎల్ లో సత్తా చాటాడు. దిల్లీ తరుపున మెరుగులు ఇన్నింగ్స్ లు ఆడి ఏకంగా రెండు మ్యాచుల్లో 15 బంతుల్లోనే అర్ధ శతకం బాదేశాడు.
Details
సురేష్ రైనా - 16 బంతులు
మిస్టర్ ఐపీఎల్ గా పేరు సంపాదించిన సురేష్ రైనా చైన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2014లో సీఎస్కే తరుపున పంజాబ్ పై 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు
ట్రావిస్ హెడ్- 16 బంతులు
సన్ రైజర్స్ విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ గతేడాది ఏకంగా రెండు మ్యాచుల్లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీని బాదేశాడు. దిల్లీ క్యాపిట్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై ఈ ఫీట్ ను నమోదు చేశాడు.