Page Loader
World Cup 2023 Prize Money : వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?

World Cup 2023 Prize Money : వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2023
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో వరుసగా 10 మ్యాచుల్లో నెగ్గి ఫైనల్‌కు చేరిన భారత్, చివర్లో మాత్రం ఆసీస్ చేతిలో చిత్తు అయ్యింది. ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో భారత అభిమానులు ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వ విజేతగా అవతరించింది. ఇక ఈ మెగా టోర్నీలో ఛాంపియన్స్, రన్నరప్ జట్లు ఎంత ప్రైజ్ మనీ గెలుచుకున్నాయో తెలుసుకుందాం.

Details

భారత్ కు 2 మిలియన్ డాలర్లు

ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు 4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం 33.17 కోట్లు) లభించింది. రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు 2 మిలియన్ డాలర్లు(16.58కోట్లు) దక్కింది. మరోవైపు సెమీ ఫైనల్లో ఓటమిపాలైన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌కు 8లక్షల యూఎస్ డాలర్లు (6.63కోట్లు) చొప్పున అందించారు. ఇక గ్రూపు దశలో వైదొలిగిన 6 జట్లకు లక్ష యూఎస్ డాలర్లు (82.92 లక్షలు) చొప్పున లభించింది. మరోవైపు అదనంగా ప్రతీ గ్రూప్ స్టేజ్ విజయానికి ఆయా జట్లకు 40,000 డాలర్లు(సూమారు రూ.33 లక్షలు) దక్కాయి.