Team India : ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీ.. 2024 షెడ్యూల్ ఇదే..
వరుస షెడ్యూళ్లతో ఈ ఏడాది టీమిండియా(Team India) బిజీబిజీగా గడపనుంది. ప్రపంచ కప్ ఫైనల్ దారుణ ఓటమి తర్వాత ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ గెలుచుకొని దేశానికి మరో కప్ అందించాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. ఈ ఏడాది భారత జట్టు స్వదేశంతో పాటు విదేశాల్లోనూ చాలా సిరీస్‌లు ఆడనుంది. ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్‌లో రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత ఆప్గాన్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ జరగనుంది. ఇక ఇదే నెలలో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించి 5 టెస్టులు ఆడనుంది.
మూడు ఐసీసీ టోర్నీలు ఆడనున్న టీమిండియా
ఏప్రిల్-మే మధ్య ఐపీఎల్ (IPL) కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు విరామం లభించనుంది. ఈ ఏడాదిలో భారత జట్టు మూడు ఐసీసీ(ICC) ట్రోఫీలలో ఆడనుంది. పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 4- 30 వరకు వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగబోయే మెగాటోర్నీలో పాల్గొననుంది. సెప్టెంబర్ - అక్టోబర్‌లలో బంగ్లాదేశ్ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అదే విధంగా అండర్ - 19 (పురుషుల) వరల్డ్ కప్ కూడా ఈ ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 దాకా జరగనుంది.
భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే
- జనవరి 3-7 : రెండో టెస్టు (కేప్‌టౌన్, దక్షిణాఫ్రికా) - జనవరి 11 నుంచి 17 వరకు అఫ్గానిస్తాన్‌తో మూడు టీ20లు (స్వదేశంలో) - జనవరి 25 నుంచి 29 వరకు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ (స్వదేశంలో) - జూన్ 4 నుంచి 30 దాకా టీ20 వరల్డ్ కప్ (వెస్టిండీస్-అమెరికా) - జులై లో శ్రీలంక పర్యటన.. రెండు టెస్టులు, మూడు టీ20లు - సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లు (స్వదేశంలో) - అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు (స్వదేశంలో) - నవంబర్ నుంచి జనవరి 2025 దాకా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు