Page Loader
IND Vs ENG : ఈసారి 'బెస్ట్ ఫీల్డర్'లో బిగ్ ట్విస్ట్.. కళ్లు చెదిరేలా ప్రకటించిన కోచ్
ఈసారి 'బెస్ట్ ఫీల్డర్'లో బిగ్ ట్విస్ట్.. కళ్లు చెదిరేలా ప్రకటించిన కోచ్

IND Vs ENG : ఈసారి 'బెస్ట్ ఫీల్డర్'లో బిగ్ ట్విస్ట్.. కళ్లు చెదిరేలా ప్రకటించిన కోచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2023
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో అటు బౌలర్లు, ఇటు ఫీల్డర్ల కృషి మరువలేనిది. అయితే ఈ మెగాటోర్నీ తొలి మ్యాచుతోనే బెస్ట్ ఫీల్డర్ మోడల్స్‌ను భారత మేనేజ్‌మెంట్ అందిస్తోంది. మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ చేసిన ప్లేయర్స్‌కు పతకాలను కూడా అందిస్తోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ మెడల్స్‌ను అందుకున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులోనూ ఓ ప్లేయర్‌కి ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Details

బెస్ట్ ఫీల్డర్ గా కేఎల్ రాహుల్

ఇంగ్లండ్ మ్యాచులో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్ మధ్య తీవ్ర పోటి నెలకొందని, చివరికి రాహుల్ బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను కైవసం చేసుకున్నట్లు దిలీప్ పేర్కొన్నారు. ఈ పతకాన్ని కేవలం గణాంకాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇవ్వట్లేదని, మైదానంలో ఏ ప్లేయర్ ఎంత మేర ప్రభావం చూపించిన వారిని విజేతలుగా ప్రకటిస్తున్నామని చెప్పారు. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఇషాన్ కూడా మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడని కొనియాడారు. ఈసారి ఎల్ఈడీ లైట్లతో విజేత పేరును ప్రకటించడం విశేషం.