Year Ender 2024: ఈ ఏడాది క్రీడా విశేషాలు.. చరిత్ర సృష్టించిన మను భాకర్.. పీవీ సింధు వివాహం..దీపా కర్మాకర్ వీడ్కోలు!
ఈ ఏడాది పారిస్ ఒలిపింక్స్‌లో భారత్ అశించిన స్థాయిలో విజయాలను సాధించలేదు. ఒక్క మాను భాకర్ మాత్రమే సత్తా చాటారు మాను భాకర్ చరిత్ర భారత యువ షూటర్ మాను భాకర్ ఈ ఒలింపిక్స్‌లో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఆమె ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళా షూటర్‌గా నిలిచారు. వ్యక్తిగత ఈవెంట్‌లో పతకం సాధించిన తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకుని, భారతదేశం కోసం రెండు పతకాలు సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
రజతం సాధించిన నీరజ్ చోప్రా
పారిస్ ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రో దిగ్గజం నీరజ్ చోప్రా రజత పతకం సాధించి భారతదేశానికి గౌరవం తీసుకువచ్చాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేతగా నిలిచిన నీరజ్ ఈసారి పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను అధిగమించలేకపోయాడు. హాకీలో వరుసగా రెండో కాంస్యం భారత పురుషుల హాకీ జట్టు పారిస్‌లోనూ తమ స్థాయిని నిలబెట్టుకుని కాంస్య పతకం గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకంతో తిరిగి పూర్వ వైభవాన్ని ప్రారంభించిన భారత హాకీ జట్టు, ఈసారి కూడా అద్భుత ప్రదర్శనతో మెరిసింది.
వినేష్ ఫోగట్‌కు పెద్ద ఎదురుదెబ్బ
మహిళల రెజ్లింగ్‌లో భారత్‌కు భారీ ఆశలు ఉన్న వినేష్ ఫోగట్, ఫైనల్‌కు ముందు బరువు పెరగడం వల్ల పతకాన్ని కోల్పోయారు. ఇది ఆమె కెరీర్‌లో పెద్ద ఎదురు దెబ్బగా మారింది. అమన్ సెహ్రావత్ అరుదైన ఘనత అతి పిన్న వయస్కుడైన రెజ్లర్ అమన్ సెహ్రావత్, ఒలింపిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. భారత యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. భారత క్రీడాకారుల మెరుగైన ప్రదర్శన ఈ ఒలింపిక్స్‌లో భారత్ 1 రజతం, 5 కాంస్యాలు గెలుచుకుంది. ఇదే వరకు జరిగిన ఒలింపిక్స్‌లతో పోలిస్తే ఇది భారత అథ్లెట్ల అత్యుత్తమ ప్రదర్శన.
పీవీ సింధు రెండు విజయాలు
ఒలింపిక్స్‌లో నిరాశను ఎదుర్కొన్నా, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌ను గెలిచిన పివి.సింధు, తర్వాత తన వివాహం గురించి ప్రకటించి శుభవార్తను పంచుకున్నారు. లక్ష్య సేన్‌కు నిరాశ పారిస్‌లో బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ చివరి మెట్టుపై పోరాడి నాలుగో స్థానంలో నిలిచాడు. స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోవడం ఆ అభిమానులను బాధించింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజయం పురుషుల, మహిళా హాకీ జట్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో చైనాను ఓడించి గెలుపొందారు. ఇది భారత హాకీకి మరో విశేష ఘనతగా నిలిచింది.