ఆ స్టేడియాలకు ద్వైపాక్షిక సిరీస్‌లలో పెద్దపీట: బీసీసీఐ కార్యదర్శి
భారత వేదికగా వన్డే ప్రపంచ కప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వేదికలకు ఐసీసీ ఖారారు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 15న టీమిండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగుంది. వన్డే ప్రపంచ కప్ లో కొన్ని వేదికలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఈ మధ్య విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు. ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకోలేకపోయిన స్టేడియాలకు ద్వైపాక్షిక సిరీస్‌లలో అధిక ప్రాధాన్యమిస్తామని అతను వెల్లడించారు. ఈ మేరకు ఆ రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు లేఖను రాశాడు.
హైదరాబాద్ లో మూడు మ్యాచులు
ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్‌లోని 10 వేదికల్లో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. అందులో హైదరాబాద్ మినహా మిగిలిన అన్నీ స్టేడియాల్లో ఐదేసి మ్యాచులు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి కేవలం మూడు మ్యాచులను మాత్రమే కేటాయించారు. అదే విధంగా వార్మప్ మ్యాచుల్లో రెండింటిని హైదరాబాద్ కు కేటాయించారు. ఈ వ్యవహరంపై పలు రాష్ట్ర సంఘాలు విమర్శలు వ్యక్తం చేశాయి. మెగాటోర్నీ అనంతరం భారత్ జరిగే మిగతా సిరీస్‌లలో మిగిలిన మైదానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆ లేఖలో వివరించారు.