Page Loader
IND Vs AUS : సౌతాఫ్రికా టూరులో ముగ్గురు కెప్టెన్లు.. ప్రయోగం ఫలించేనా?
సౌతాఫ్రికా టూరులో ముగ్గురు కెప్టెన్లు.. ప్రయోగం ఫలించేనా?

IND Vs AUS : సౌతాఫ్రికా టూరులో ముగ్గురు కెప్టెన్లు.. ప్రయోగం ఫలించేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2023
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లకు ప్రకటించింది. టెస్టులకు రోహిత్ శర్మ, వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ లకు నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిర్ణయించుకున్నారు. టెస్టులో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రాను బీసీసీఐ నియమించింది. ఇక హార్ధిక్ పాండ్యా లేకపోవడంతో టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఇక వన్డేలకు ఎంపికైన ఆటగాళ్లలో చాలా మందికి టెస్టులు, టీ20ల్లో చోటు దక్కలేదు. శ్రేయస్‌ అయ్యర్‌, ముకేశ్‌ కుమార్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ మాత్రమే మూడు జట్లలో ఉన్నారు

Details

వన్డేల్లో సంజు శాంసన్ కి చోటు

వన్డేలో రాహుల్ నేతృత్వంలో జట్టుగా కొత్తగా కనిపిస్తోంది. రజత్ పటీదార్, సాయి సుదర్శన్, రింకు సింగ్ తొలిసారిగా వన్డేల్లో చోటు సంపాదించుకున్నారు. టెస్టుల్లో చోటు దక్కిన కుల్దీప్ యాదవ్‌కు వన్డే, టీ20 జట్లలో స్థానం లభించింది. ప్రపంచ కప్‌లో చోటు దక్కపోయినా చాహల్ కు తిరిగి వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు. సంజు శాంసన్ వన్డేల్లోకి చోటు లభించగా, టీ20 జట్టు వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా నియమితులయ్యాడు. ఇక దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్‌-ఎ జట్టుగా కెప్టెన్‌గా కోన భరత్‌ నియమితుడయ్యాడు

Details

అంజిక్య రహానే, ఛతేశ్వర్ పుజారాపై వేటు

అంజిక్య రహానే, ఛతేశ్వర్ పుజారాపై వేటు పడింది. వీళ్లద్దరితో పాటు ఉమేష్ యాదవ్ కు కూడా అవకాశం లభించలేదు. టెస్టు జట్టులో స్థానం కోసం కుర్రాళ్లు పోటీపడటంతో ఈ ముగ్గురిని టెస్టుల్లోకి ఎంపిక చేయలేదు. టెస్టు జట్టు రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, కోహ్లి, శ్రేయస్‌, రుతురాజ్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌, అశ్విన్‌, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, షమి, బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ

Details

టీ20, వన్డేలకు ఎంపికైన జట్టు సభ్యులు వీరే

టీ20 జట్టు సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, శ్రేయస్‌, ఇషాన్‌ కిషన్‌, జితేశ్‌ శర్మ, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌. వన్డే జట్టు రాహుల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌, సాయి సుదర్శన్‌, తిలక్‌ వర్మ, రజత్‌ పటీదార్‌, రింకు సింగ్‌, శ్రేయస్‌, సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌, ముకేశ్‌ కుమార్‌, అవేష్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌.