NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం 
    ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2025
    05:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్ చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది.

    జట్టులోని ఇంగ్లండ్ క్రికెటర్ జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు.

    అతని స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ టిమ్ సీఫెర్ట్‌ను ఆర్సీబీ యాజమాన్యం జట్టులో తీసుకుంది.

    భారతదేశం-పాకిస్థాన్ సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఐపీఎల్ షెడ్యూల్ ఒక వారం వాయిదా పడిన తర్వాత పునఃప్రారంభం సమయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.

    ఈ షెడ్యూల్ మార్పులు ఇప్పుడు ప్లేఆఫ్స్ దశలో ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి.

    వివరాలు 

    మే 29 నుంచి ఇంగ్లండ్,వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్

    మే 29 నుంచి ఇంగ్లండ్,వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుండటంతో,జాకబ్ బెతెల్ తన జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది.

    అందువలన అతను ఈ సీజన్‌లో ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు దూరంగా ఉండాల్సివచ్చింది.

    మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న లీగ్ మ్యాచ్ బెతెల్‌కు ఐపీఎల్‌లో చివరి మ్యాచ్‌గా ఉండనుంది.

    ఆ తరువాత,మే 24న అతను స్వదేశానికి బయలుదేరి ఇంగ్లండ్ జట్టుతో కలవనున్నాడు.

    జాకబ్ బెతెల్ స్థానంలో టిమ్ సీఫెర్ట్‌ను తీసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది.

    సీఫెర్ట్‌కు ఈ సీజన్‌కు రూ. 2 కోట్లు జీతంగా చెల్లించనున్నారు. ఈ ఒప్పందం మే 24నుంచి అమల్లోకి వస్తుంది.

    టిమ్ సీఫెర్ట్ ఇప్పటి వరకు 66 టీ20 మ్యాచ్‌లు ఆడి, 1,540 పరుగులు సాధించాడు.

    వివరాలు 

    జోస్ బట్లర్ కూడా ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు

    గతంలో 2022 ఐపీఎల్ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా అతనికి ఉంది. మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆర్సీబీ చివరి లీగ్ మ్యాచ్ ఉంటుంది.

    ఆ మ్యాచ్‌లో టిమ్ సీఫెర్ట్ ఆర్సీబీ తరఫున పాల్గొనవచ్చు. ఈ పరిణామం ఆర్సీబీ అభిమానుల్లో కొత్త ఆశలు, ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

    ఇటీవల పాకిస్థాన్‌తో వైట్ బాల్ క్రికెట్‌లో సీఫెర్ట్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.ఇంగ్లండ్-వెస్టిండీస్ సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు)ప్రభావం ఆర్సీబీపై మాత్రమే కాకుండా మరో ప్రఖ్యాత జట్టుపై కూడా పడింది.

    గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా ఈ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    IPL 2023: ఆర్సీబీ పై రివేంజ్ తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ రెడీ! ముంబయి ఇండియన్స్
    తెలుగు కుర్రాడు రీ ఎంట్రీ.. ఆర్సీబీతో తలపడే ముంబై జట్టు ఇదే! ముంబయి ఇండియన్స్
    ఆర్సీబీకి బిగ్ షాక్.. దినేష్ కార్తీక్ కు అనారోగ్యం ఐపీఎల్
    RR Vs RCB: ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. 59 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్ ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025