Manoj Tiwary: 'నన్ను ఎందుకు తొలగించారని ధోనీని అడగాలనుకుంటున్నాను': అవకాశం ఇస్తే రోహిత్ శర్మ,విరాట్ లా ఆడేవాడిని
క్రికెట్ నుండి రిటైర్ అయిన ఒక రోజు తర్వాత,బెంగాల్ స్టార్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతని చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసినప్పటికీ,2011లో ప్లేయింగ్ XI నుండి తనను ఎందుకు తొలగించారని అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనిని అడగాలనుకున్నా అని మనోజ్ తివారి తెలిపాడు. తనకు గనుక అవకాశాలు లభిస్తే..విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మల మాదిరి హీరో అయ్యేవాడిని అని చెప్పుకొచ్చాడు. 2024రంజీ ట్రోఫీ సీజన్‌లో భాగంగా బిహార్‌తో మ్యాచ్ అనంతరం 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు మనోజ్ తివారి తెలిపాడు. తివారీ ధోని నాయకత్వంలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.2008-2015 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అతడు 12 వన్డేలు,3 టీ20లు ఆడాడు.వన్డే ఫార్మాట్‌లో 287టీ20 ఫార్మాట్‌లో 15 పరుగులు చేశాడు.
మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా
అతను డిసెంబర్ 2011లో వెస్టిండీస్‌పై చెన్నైలో సెంచరీ చేశాడు. ఇటీవల,కేరళతో రంజీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తివారి X (ట్విటర్ ) వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వచ్చే సీజన్ నుంచి రంజీ సీజన్‌ను తొలగించాలని, ఈ టోర్నీలో అనేక తప్పులు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. ఘన చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీలో లోపాలున్నాయని, ఈ టోర్నీ ప్రాముఖ్యతను క్రమంగా కోల్పోతున్నదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే విషయమై తివారి తన ఫేస్‌బుక్ లైవ్‌లో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలతో అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు.