Page Loader
Ashish Nehra: గిల్‌పై నమ్మకం ఉంది.. అందుకే అతనికి కెప్టెన్సీ ఇచ్చాం : అశిష్ నెహ్రా
గిల్‌పై నమ్మకం ఉంది.. అందుకే అతనికి కెప్టెన్సీ ఇచ్చాం : అశిష్ నెహ్రా

Ashish Nehra: గిల్‌పై నమ్మకం ఉంది.. అందుకే అతనికి కెప్టెన్సీ ఇచ్చాం : అశిష్ నెహ్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2023
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ముంబై ఇండియన్స్ తిరిగి వెళ్లిన తర్వాత గుజరాత్ టైటాన్స్ తదుపరి కెప్టెన్‌గా శుభమన్ గిల్ (Shubman Gill) ఎంపికయ్యాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ లో చేరిన గిల్ అప్పటి నుంచి మరింత దూకుడుగా ఆడుతున్నాడు. పాండ్యా నాయకత్వంలో 2022లో ఐపీఎల్(IPL)టైటిల్ గెలుచుకోవడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. 2023 ఫైనల్లో కూడా గుజరాత్ ఫైనల్‌కు చేరుకోవడంలోనూ అతని పాత్ర ఉంది. ఇప్పటి వరకూ గుజరాత్ తరుపున మొత్తం 17 మ్యాచులాడి 157.80 స్ట్రైక్ రేట్‌తో 890 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. పాండ్యా బాధ్యతలను గిల్ చక్కగా నిర్వర్తించగలడా అనేది సందేహంగా మారింది. దీనిపై ఆ జట్టు హెడ్ కోచ్ అశిష్ నెహ్రా(Ashish Nehra)స్పందించాడు.

Details

గిల్ కు మద్దతు ఇస్తాం: నెహ్రా

పాండ్యా స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని, అయితే ఆ బాధ్యతలను గిల్ సక్రమంగా నిర్వర్తిస్తాడని చెప్పాడు. గత మూడు, నాలుగేళ్లలో గిల్ ఆట‌తీరు ఎలా ఉందో చూస్తున్నామని, ప్రస్తుతం అతని వయస్సు 24-25 సంవత్సరాలని కానీ అతనికి మంచి అనుభవం ఉందని పేర్కొన్నాడు. అతనికి మద్దతు ఇవ్వడానికి తాము అండగా ఉంటామని, జట్టుకు అతడిపై నమ్మకం ఉండడం వల్లే గిల్‌ని కెప్టెన్‌గా నియమించామని తెలియజేశాడు. ఎప్పుడూ రిజల్ట్ చూసే వాళ్లలో తాను ఉండనని, మ్యాచ్ సమయంలో ప్రతి ఒక్కరూ ఫలితాల కోసం ప్రయత్నిస్తారన్నారు.