Page Loader
WI vs IND : నేడు టీమిండియా, వెస్టిండీస్ మధ్య వందో టెస్టు మ్యాచ్
సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది

WI vs IND : నేడు టీమిండియా, వెస్టిండీస్ మధ్య వందో టెస్టు మ్యాచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2023
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, వెస్టిండీస్ మధ్య నేటి నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టును మూడు రోజులలోనే ముగించిన టీమిండియా, రెండో మ్యాచులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు వెస్టిండీస్ సొంతగడ్డపై ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆరాటపడుతోంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరించనుంది. ఈ మైదానంలో 61 టెస్టు మ్యాచులు జరగ్గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 20సార్లు గెలుపొందాయి. వెస్టిండీస్ చివరిసారిగా 1989లో క్వీన్స్ పార్క్‌లో భారత్‌ను ఓడించిన విషయం తెలిసిందే.

Details

వెస్టిండీస్, టీమిండియా తుది జట్ల అంచనా

వెస్టిండీస్, భారత జట్లకు ఈ మ్యాచ్ ప్రత్యేకంగా నిలవనుంది. ఇరు జట్లకు ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. మరి ఈ ప్రత్యేక మ్యాచులో వెస్టిండీస్ జట్టు పోటీనిస్తుందో లేదో వేచి చూడాలి భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మరియు మహ్మద్ సిరాజ్. వెస్టిండీస్ జట్టు : క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), టాగెనరైన్ చందర్‌పాల్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (వికెట్-కీపర్), జాసన్ హోల్డర్, కెవిన్ సింక్లైర్, రహ్కీమ్ కార్న్‌వాల్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వార్రికన్,