Page Loader
IND vs NZ: బెంగళూరులో భారీ వర్షం .. టాస్ ఆలస్యం.. మొదటి సెషన్‌ ఆట కష్టమే!  
బెంగళూరులో భారీ వర్షం .. టాస్ ఆలస్యం.. మొదటి సెషన్‌ ఆట కష్టమే!

IND vs NZ: బెంగళూరులో భారీ వర్షం .. టాస్ ఆలస్యం.. మొదటి సెషన్‌ ఆట కష్టమే!  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 సిరీస్‌తో అభిమానులను అలరించిన టీమిండియా ఇప్పుడు మరో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతోంది. అయితే,వర్షం మాత్రం మ్యాచ్‌కి అడ్డంకి సృష్టించడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. బెంగళూరులో ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ ఆలస్యం కానుంది. వర్షం పడుతున్న కారణంగా టాస్‌ వేయడం సాధ్యం కాలేదు.ఒకవేళ ఈ క్షణం వర్షం ఆగినా, మైదానాన్ని సిద్ధం చేసేందుకు కనీసం అరగంట నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే టాస్‌ వేస్తారు.టాస్‌ వేసిన తర్వాత ఆట ప్రారంభం కావడానికి కనీసం 15 నుంచి 30 నిమిషాల సమయం పట్టాల్సి ఉంటుంది.

వివరాలు 

అత్యాధునిక టెక్నాలజీతో..

దీంతో,తొలి రోజు మొదటి సెషన్‌ ఆట సాధ్యపడడం చాలా కష్టంగా కనిపిస్తోంది అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంత భారీ వర్షం పడినా మ్యాచ్‌ను సిద్ధం చేయగల టెక్నాలజీ బెంగళూరు మైదానంలో ఉంది. నిమిషానికి పదివేలు లీటర్ల నీటిని పీల్చగల సామర్థ్యం కలిగిన సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ ఇక్కడ ఉంది. దీని ద్వారా వర్షం ఆగిన వెంటనే పిచ్‌తోపాటు మైదానం చిత్తడిగా లేకుండా చేసేందుకు వీలుంది. అయితే, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కొనసాగితే, తొలి రోజు ఆటను చూడడం కష్టమయ్యే అవకాశముంది.

వివరాలు 

సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ ఏం చేస్తుంది? 

కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌ దాదాపు 10ఏళ్ళ నుంచి సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ను వినియోగిస్తోంది. ఇది తొలిసారి 2015లో భారత్ - దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్‌ కోసం ప్రవేశపెట్టింది. పిచ్‌తోపాటు, మైదానంలోని పచ్చిక కింద వివిధ లేయర్లలో ఇసుకను ఉపయోగించారు. మిగతా మైదానాల్లో ఎక్కువగా మట్టిని నింపుతారు,కానీ ఇక్కడ ఇసుక ఉండటంతో నీరు మైదానంలో ఉండకుండా మెషిన్‌ స్టార్ట్‌ చేయగానే బయటకు వచ్చేస్తుంది. ఇందుకు 200 హార్స్‌పవర్‌ యంత్రాలతో సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ పనిచేస్తుంది. అక్కడినుంచి నీటిని డ్రైనేజ్‌ల ద్వారా బయటకు పంపిస్తారు. ఆ తర్వాత డ్రయర్లతో, రోప్స్‌తో గ్రౌండ్‌ను రెడీ చేస్తారు.