మాంచెస్టర్ సిటీని 1-0తో ఓడించిన టోటెన్‌హామ్
ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఆదివారం మంచెస్టర్ సిటీ, టోటెన్ హామ్ తలపడ్డాయి. ఈ కీలక పోరులో మంచెస్టర్ సిటీని టోటెన్ హామ్ 1-0తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో హ్యారికేన్ అరుదైన ఘనతను సాధించాడు. 200వ ప్రీమియర్ లీగ్ గోల్ సాధించి హ్యారికేన్ అద్భుత రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు షియరర్, వేన్ రూనీ 200వ గోల్స్ చేసిన విషయం తెలిసిందే. కేన్ 304వ మ్యాచ్‌లలో తన 200వ గోల్‌ను సాధించడం విశేషం.
హాలాండ్ చెత్త రికార్డు
ఈ సీజన్‌లో కేన్ తన 17వ ప్రీమియర్ గోల్ చేశాడు. తన 304వ పీఎల్ మ్యాచ్ ఆడుతున్న కేన్ 200 గోల్స్, 44 అసిస్టులు కలిగి ఉన్నాడు. 22 ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లలో కేన్ 17 గోల్స్ చేశాడు. మ్యాన్ సిటీ 15 ప్రయత్నాలతో 5సార్లు లక్ష్యాన్ని సాధించింది. మాంచెస్టర్ సిటీ 21 మ్యాచ్‌లలో 45 పాయింట్లతో సిటీ రెండో స్థానంలో ఉంది. స్పర్స్ 22 మ్యాచ్‌లతో 39 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఎర్లింగ్ హాలాండ్ మ్యాన్ సిటీలో తరుపున ప్రీమియర్ లీగ్ గేమ్‌లో షాట్ చేయడంలో విఫలమయ్యాడు. హాలాండ్ 2023లో స్వదేశం నుండి ఒక్క గోల్ కూడా చేయకపోవడం గమనార్హం.