అంతర్జాతీయ క్రికెట్‌లోకి ట్రాన్స్‌జెండర్.. కెనడా ఉమెన్స్ టీ20 జట్టులో చోటు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్‌లోకి మొట్టమొదటి సారిగా ట్రాన్స్ జెండర్ అడుగుపెట్టింది. కెనడా ఉమెన్స్ టీ20 జట్టులో ట్రాన్స్ జెండర్ కి అవకాశం లభించింది.
అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న మొట్టమొదటి ట్రాన్స్ జెండర్‌గా డేనియల్ మెక్ గాహే రికార్డుకెక్కింది.
బంగ్లాదేశ్‌తో జరిగే 2024 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కి కెనడా ప్రకటించిన జట్టులో డేనియల్ మెక్ గాహేకి చోటు లభించింది.
ఐసీసీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో డేనియల్ మెక్ గాహే మెరిట్ మార్కులతో పాస్ కావడంతో ఆ ట్రాన్స్ జెండర్‌కు అవకాశం లభించింది.
2020లో ఆస్ట్రేలియా నుంచి కెనడాకి వలస వెళ్లిన డేనియల్ మెక్ గాహే అదే ఏడాది మహిళాగా జెండర్ ట్రాన్స్ ఫర్ చేయించుకుంది.
Details
చాలా గర్వంగా ఉందన్న డేనియల్ మెక్ గాహే
అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టడం చాలా గర్వంగా ఉందని డేనియల్ మెక్ గాహే ప్రకటించింది.
ఇది నిజంగా చాలా గొప్ప విషయమని, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని వరల్డ్ క్రికెట్ లో రిప్రెజెంట్ చేయబోతున్నానని, తనకు అన్ని విధాలుగా సాయం చేసిన డాక్టర్స్ కి డేనియల్ మెక్ గాహే ధన్యవాదాలు తెలిపింది.
ఐసీసీకి ప్రతి నెలా రక్తనమూనాలను ఇవ్వడం తనకు సవాలుగా మారిందని, అయితే డాక్టర్ల సాయంతో అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశానని, అయితే ప్రోటోకాల్ ని అనుసరించి, మహిళా క్రికెటర్ గా ముద్ర వేసుకోగలిగానని డేనియల్ మెక్ గాహే పేర్కొంది.