Loading...
Travis Head: విరాట్ కోహ్లీతో వివాదంపై మౌనం వీడిన ట్రావిస్ హెడ్.. వైరల్ ప్రచారానికి ఫుల్ స్టాప్
విరాట్ కోహ్లీతో వివాదంపై మౌనం వీడిన ట్రావిస్ హెడ్.. వైరల్ ప్రచారానికి ఫుల్ స్టాప్

Travis Head: విరాట్ కోహ్లీతో వివాదంపై మౌనం వీడిన ట్రావిస్ హెడ్.. వైరల్ ప్రచారానికి ఫుల్ స్టాప్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 25, 2026
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీతో తనకు విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై తొలిసారి స్పందించాడు. మ్యాచ్ అనంతరం ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే వార్తలను పూర్తిగా ఖండిస్తూ అసలు విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌కు హ్యాండ్‌షేక్ ఇవ్వలేదని సూచించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరు స్టార్ క్రికెటర్ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయనే ప్రచారం జోరందుకుంది. 'కోడ్ స్పోర్ట్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రావిస్ హెడ్ అన్ని ఊహాగానాలకు తెరదించాడు.

వివరాలు

కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్..

"మా ఇద్దరి మధ్య రాజీ పడాల్సిన పరిస్థితి అసలు రాలేదు. విరాట్ కోహ్లీతో నా సంబంధం ఎప్పటిలాగే స్నేహపూర్వకంగానే ఉంది.

మైదానంలో జరిగే సంఘటనలు ఆటలో భాగమే. వాటిని వ్యక్తిగత విభేదాలుగా చూడాల్సిన అవసరం లేదు.

మా మధ్య ఎలాంటి గొడవా, వివాదమా లేదు" అని హెడ్ స్పష్టం చేశాడు.

అంతేకాకుండా, మైదానంలో జరిగే పోటీని ప్రొఫెషనల్ క్రికెటర్‌గా తాను ఎప్పుడూ సహజంగానే స్వీకరిస్తానని హెడ్ తెలిపాడు.

అయితే సోషల్ మీడియా వేదికగా తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ట్రోలింగ్ మాత్రం తీవ్ర ఆవేదన కలిగించిందని చెప్పాడు.

వివరాలు

జెస్సికా హెడ్‌కు సోషల్ మీడియాలో అనుచితమైన సందేశాలు..

ఈ వివాదం సమయంలో తన భార్య జెస్సికా హెడ్‌కు సోషల్ మీడియాలో అనుచితమైన సందేశాలు పెద్ద సంఖ్యలో వచ్చాయని ఆయన వెల్లడించాడు.

"నేను, జెస్సికా క్రీడా ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలుసు.

కానీ ఆ ట్రోలింగ్ మా కుటుంబంలోని ఇతర సభ్యుల వరకు చేరుకోవడం బాధాకరం. జెస్సికా ఎంతో పరిణతితో ఈ పరిస్థితిని ఎదుర్కొంది.

కొంతకాలం తర్వాత ప్రజలు ఈ విషయాన్ని మరిచిపోతారు.

కానీ ఆటగాళ్ల కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో విమర్శలు, దూషణలకు గురిచేయడం మాత్రం నిజంగా దురదృష్టకరమైన విషయం" అని ట్రావిస్ హెడ్ పేర్కొన్నాడు.

ADVERTISEMENT