Page Loader
కెప్టెన్‌గా నితీష్ ఎంపికపై కేకేఆర్ తప్పు చేసిందంటూ ట్రోల్స్..!
కేకేఆర్ కెప్టెన్‌గా నితీష్ రాణా

కెప్టెన్‌గా నితీష్ ఎంపికపై కేకేఆర్ తప్పు చేసిందంటూ ట్రోల్స్..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2023
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ లో రెండు సార్లు టైటిగ్ నెగ్గిన కోల్ కత్తా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గాయంతో ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ 2023లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కు నితీష్ రాణా‌కు సారథ్య బాధ్యతలను అప్పగించారు. ఇది చూసిన అభిమానులు షాక్ అయ్యారు. జట్టులో అర్హులైన ప్లేయర్స్ ఉన్నా.. రానాకు కెప్టెన్సీని ఎందుకిచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా జట్టును నడిపించే సామార్థ్యం, అనుభవం రానాకు లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా షారుక్ అండతోనే అతడు కెప్టెన్ అయ్యాడని విమర్శలు చేస్తున్నారు. కెప్టెన్సీ రేసులో రానాతో పాటు సునీల్ నరైన్ పేరు కూడా వినిపించింది.

కోల్‌కతా నైట్ రైడర్స్

రానాను కెప్టెన్‌గా నియమించడం సరికాదన్న ఫ్యాన్స్

కోల్‌కతా తరఫున 74 మ్యాచ్‌లు ఆడిన నితీశ్.. 135.61 స్ట్రయిక్ రేట్‌తో 1744 రన్స్ చేశాడు గతంలో సౌరబ్ గంగూలీ, గౌతమ్ గంభీర్, ఇయాన్ మోర్గాన్ లాంటి ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించారు. రంజీట్రోఫీలో ఢిల్లీ జట్టులోనే చోటు దక్కించుకోలేక పోయిన ఆటగాడిని తమ ఫ్రాంచైజీ ఏకంగా కెప్టెన్‌గా నియమించడం పట్ల ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విదేశీ ఆటగాణ్ని కెప్టెన్ చేస్తే.. అతడు సరిగా ఆడకపోయినా తుది జట్టులో కొనసాగించాల్సి ఉంటుంది. అదే భారత ఆటగాడు కెప్టెన్ అయితే తమకు నచ్చిన నలుగురు విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేయోచ్చని ఫ్రాంచేజీ ఆలోచించినట్లు తెలుస్తోంది. గ‌త సీజ‌న్‌లో 14 మ్యాచ్‌ల‌లో 361 ర‌న్స్ చేశాడు రానా.. మిడిలార్డర్ రాణించే అవకాశం ఉండటంతో సారథ్య బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.