LOADING...
Team India : రెండు కేక్‌లు.. నవ్వులు పూయించిన జడేజా-పంత్ సరదా సన్నివేశం!
రెండు కేక్‌లు.. నవ్వులు పూయించిన జడేజా-పంత్ సరదా సన్నివేశం!

Team India : రెండు కేక్‌లు.. నవ్వులు పూయించిన జడేజా-పంత్ సరదా సన్నివేశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 వరల్డ్‌కప్ 2024 టైటిల్ గెలుచుకున్న భారత జట్టుకు జూన్ 29న సంవత్సరం పూర్తైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రస్తుతం ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్‌లో రెండో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్న టీమిండియా సభ్యులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్‌మీడియా అకౌంట్లలో షేర్ చేసింది. వీడియోలో టీమిండియా ఆటగాళ్లు రెండు కేకులు కట్ చేసిన దృశ్యాలు కనిపించాయి. ఒక కేకుపై 'Team India', మరొకదాని పై 'Champions T20 World Cup 2024' అని రాసి ఉండగా, తొలుత అర్ష్‌దీప్ సింగ్‌ను కేక్ కట్ చేయమని అభ్యర్థించారు. ఆ తర్వాత జట్టు సభ్యుల అందరి వుందటంతో బుమ్రాను ముందుకు తీసుకొచ్చారు.

Details

సంతోషాన్ని పంచుకున్న ప్లేయర్లు

అతను ఒక కేక్‌ను కట్ చేయగా, మరొక కేక్‌ను మహ్మద్ సిరాజ్ కట్ చేశాడు. అనంతరం ఆటగాళ్లు ఒకరికి ఒకరు కేక్ తినిపిస్తూ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలో రిషభ్ పంత్ తనకు చిన్ని స్నేహితుడు రవీంద్ర జడేజాపై హాస్యంగా వ్యాఖ్యానించాడు. 'హ్యాపీ రిటైర్‌మెంట్' అంటూ పంత్ జడేజాను ఆటపట్టించగా, వెంటనే జడేజా స్పందిస్తూ.. నేను కేవలం టీ20 ఫార్మాట్‌ నుంచి మాత్రమే రిటైర్ అయ్యానని స్పష్టత ఇచ్చాడు. దీనితో అక్కడ ఉన్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

Details

పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన జడేజా

గతేడాది టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ గెలిచిన తర్వాత, సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ఆ తరువాత ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లీ టెస్టుల నుంచీ కూడా వైదొలిగారు. అయితే, 2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో ఉన్న ఏడుగురు ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటున్నారు.