Page Loader
Under 19 World Cup: వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపై కైఫ్ కీలక కామెంట్స్ 
Under 19 World Cup: వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపై కైఫ్ కీలక కామెంట్స్

Under 19 World Cup: వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపై కైఫ్ కీలక కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
Feb 12, 2024
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో జూనియర్ జట్టు ప్రపంచకప్‌ కల చెదిరిపోయింది. ఈ ఓటమి తర్వాత ఓ వైపు అభిమానులు టీమిండియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు కొందరు సీనియర్ ఆటగాళ్లు జట్టుకు అండగా నిలిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ఓటమిపై వెటరన్ ఆటగాడు మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అండర్-19 స్థాయిలో జట్టు ఫలితాలకు పెద్దగా పట్టింపు లేదన్నారు. భవిష్యత్‌లో పాఠాలు అనుభవం ఉపయోగపడుతుందన్నారు. భారత్ బాగా అడిందని, అలాగే ఆస్ట్రేలియా కూడా మెరుగైన ప్రదర్శన చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు కైఫ్ ట్వీట్ చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 మహ్మద్ కైఫ్ ట్వీట్